Home న్యూస్ తమ్ముడు రీ రిలీజ్ డే 1 కలెక్షన్స్….పవర్ స్టార్ ఫ్యాన్స్ రచ్చ!

తమ్ముడు రీ రిలీజ్ డే 1 కలెక్షన్స్….పవర్ స్టార్ ఫ్యాన్స్ రచ్చ!

0

రీ రిలీజ్ ల ట్రెండ్ రెండు ఏళ్ల క్రితం ఓ రేంజ్ లో టాలీవుడ్ ను ఊపేసింది…వరుస పెట్టి సినిమాలు రీ రిలీజ్ అయ్యి సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా క్రమంగా రీ రిలీజ్ లు మరీ ఎక్కువ అయిపోవడంతో ఆడియన్స్ లో రీ రిలీజ్ ల మీద ఆసక్తి కంప్లీట్ గా తగ్గిపోయి రీసెంట్ టైంలో వచ్చిన సినిమాలను పెద్దగా పట్టించుకోలేదు….

ఇలాంటి టైంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో గెలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విక్టరీని సెలబ్రేట్ చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ నటించిన ఒకప్పటి బ్లాక్ బస్టర్ తమ్ముడు(Thammudu Re Release Collections) మూవీ రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్భంగా సినిమాను రీసెంట్ గా…

రీ రిలీజ్ చేశారు మేకర్స్…దాంతో ఫ్యాన్స్ సినిమా రీ రిలీజ్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అవ్వగా RTC X రోడ్స్ లో సినిమాను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుని రీ రిలీజ్ చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ షోలే వేసినా కూడా మొదటి రోజు బుక్ మై షో లో మొత్తం మీద 5.5 వేల టికెట్ సేల్స్ జరిగాయి ఇప్పుడు….ఇక ఆఫ్ లైన్ లో కూడా సినిమాకి…

మంచి టికెట్ సేల్స్ జరగగా మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి సినిమా మొదటి రోజు రీ రిలీజ్ లో 35-40 లక్షల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది సినిమా…రీసెంట్ టైంలో రీ రిలీజ్ మూవీస్ పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ ను ఏమి చూపించ లేదు…

ఇలాంటి టైంలో రీ రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ తమ్ముడు మూవీ రీ రిలీజ్ లో మంచి ఓపెనింగ్స్ తో ఇప్పటికీ రీ రిలీజ్ లకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని నిరూపించింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ లో వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here