సూపర్ స్టార్ రజనీకాంత్ శివ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ పెద్దన్న, భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా టీసర్ ట్రైలర్ లు మరీ కొత్తగా ఏమి లేకపోయినా కానీ ఫ్యాన్స్ స్టఫ్ సినిమాలో ఉందని ట్రైలర్ చూస్తె అర్ధం అయింది, కథ పరంగా చాలా రొటీన్ కథ అని కూడా ట్రైలర్ లోనే రుజువు అయినా ఆ రొటీన్ కథని డైరెక్టర్ ఎంత ఎంగేజింగ్ గా చెబుతాడు అని ఎదురు చూడగా…
ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు వచ్చిన పెద్దన్న అంచనాలను అందుకుందా లేదా తెలుసుకుందాం పదండీ… కథ పాయింట్ కి వస్తే… ఊరి సర్పంచ్ అయిన హీరో కి తన చెల్లె ప్రపంచం, తనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేడు, చదువు కంప్లీట్ చేసుకుని ఊరికి వచ్చిన చెల్లికి…
పెళ్లి చేయాలనీ సంభందాలు చూస్తున్న టైం లో కోల్కతాలో పెళ్లి చేసుకుంటుంది కీర్తి సురేష్, కానీ అక్కడ తను అనుకోకుండా ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుంటుంది, హీరో తనని కాపాడానికి ఏం చేశాడు అన్నది మిగిలిన కథ… ఇలాంటి స్టొరీ పాయింట్ తో గత 20-25 ఏళ్లలో ఎన్నో సినిమాలు వచ్చాయి…
ఇదే మెయిన్ పాయింట్ ని ఇది వరకే డైరెక్ట్ శివ కూడా వీరం, వేదాలం మరియు విశ్వాసంలో కూడా మార్చి మార్చి వాడాడు, ఇప్పుడు ఇదే పాయింట్ తో రజినీని తీసుకుని మాస్ ఎలివేషన్ సీన్స్ ని పెట్టి పెద్దన్నగా సినిమా తీశాడు… అసలు ఏమాత్రం కొత్తదనం లేని ఈ రొటీన్ కథలో సూపర్ స్టార్ రజినీ తన వంతుగా ఎంత కుదిరితే అంత చేశాడు,
యాక్షన్ సీన్స్, డైలాగ్స్, తన స్టైల్ అన్నీ ఒకప్పటి ముత్తు, అరుణాచలం సినిమాలను గుర్తు చేస్తాయి, ఇక హీరోయిన్ నయనతార తన రోల్ లో పర్వాలేదు అనిపించగా మీనా మరియు ఖుష్బుల రోల్స్ కి చాలా తక్కువ స్పేస్ ఉంది, ఉన్నంతలో రజినీ తర్వాత ఎక్కువ స్పేస్ కీర్తి సురేష్ కి దక్కగా తన రోల్ కి బాగా న్యాయం చేసింది….
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరమ రొటీన్ అండ్ బోర్ కొట్టించాయి… డైలాగ్స్ కూడా ఔట్ డేటెడ్ యే… ఇక యాక్షన్ సీన్స్ ఓవర్ డోస్ మరీ ఎక్కువ అయిపొయింది, సంగీతం బాగుండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది కానీ మరీ లౌడ్ అయిపొయింది. ఇక సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా డైరెక్షన్ విషయంలో శివ ఈ సారి ఫెయిల్ అయ్యాడు,
రొటీన్ స్టొరీనే అయినా విశ్వాసం సినిమాలో తండ్రి కూతురి మధ్య ఎమోషన్ సీన్స్ వర్కౌట్ అవ్వడంతో ఆ సినిమా హిట్ అయింది, కానీ ఇక్కడే అదే పాయింట్ తో సినిమా వేరేలా తీసినా అన్న చెల్లెలి మధ్య సీన్స్ ఆర్టిఫీశియల్ గా ఉండటం, యాక్షన్ డోస్ హద్దులు దాటిపోయి ఇక ఎప్పుడు అయిపోతుంది అనిపించే రేంజ్ లో తీశాడు….
హీరోకు ఎలివేషన్ సీన్స్ పడటం సినిమాకి అవసరం, కానీ ఆ ఎలివేషన్ సీన్ కి తగ్గ బ్యాగ్రౌండ్ కథ జరగాలి, అలా కాకుండా ఎలివేషన్ మీద ఎలివేషన్ సీన్స్ రాసుకుని ఆ సీన్స్ మరి ఓవర్ ది టాప్ అనిపించేలా చేస్తే చూడటం కష్టం.. ఇక్కడ అదే జరిగింది, సెకెండ్ ఆఫ్ లో ఆ ఓవర్ యాక్షన్ సీన్స్ కి ఆడియన్స్ తలలు పట్టుకు కూర్చుని ఎప్పుడు సినిమా…
కంప్లీట్ అవుతుందా అని ఎదురు చూపులు చూసేలా చేశాడు, రజినీ ఎంత రెచ్చిపోతున్నా కానీ ఆడియన్స్ ఆ సీన్స్ తో కనెక్ట్ అవ్వడం కష్టం, ఇక ఫస్టాఫ్ లో ఫోర్స్ కామెడీ అయితే చిరాకు తెప్పిస్తుంది… వింటేజ్ రజినీ ని చూద్దామని వెళితే అలాంటి సీన్స్ పడ్డా ఆ సీన్స్ కి కనెక్ట్ అవ్వలేకపోతాం…
మొత్తం మీద 90’s కాలం నాటి ఈ కథ రజినీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఎలాగోలా పర్వాలేదు అనిపించినా ఇప్పుడు 2021 టైం లో అయితే మెప్పించడం కష్టం…. కథలో పవర్ లేకున్నా శివ ప్రీవియస్ మూవీస్ లో మాదిరి మ్యాజిక్ చేస్తాడు అనుకుంటే ఇక్కడ ఒక్క ఇంటర్వల్ సీన్ తప్పితే ఎక్కడా ఆ మ్యాజిక్ కనిపించలేదు… ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2 స్టార్స్…