Home న్యూస్ పెళ్లి సందD మూవీ రివ్యూ….ఏంటి సామి ఇది!!

పెళ్లి సందD మూవీ రివ్యూ….ఏంటి సామి ఇది!!

0

ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ ను ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సంచలన విజయంతో ఓ రేంజ్ లో భీభత్సం సృష్టించిన పెళ్ళిసందడి సినిమా కి సీక్వెల్ అంటూ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా కే రాఘవేంద్రరావు సమర్పణలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పెళ్లిసందD సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఎలా ఉంది ఎంత వరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసు కుందాం పదండి…

ముందుగా కథ పాయింట్ కి వస్తే… మనసుకు నచ్చిన అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని కోరుకునే హీరో తన అన్న పెళ్లి హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు, తర్వాత ఇద్దరూ ప్రేమించుకోగా కొన్ని అనుకోని అవరోధాలు వస్తాయి, వాటిని వీళ్ళు ఎలా అధిగమించి ఒకటి అయ్యారు అన్నది సినిమా కథ…

ఇలాంటి కథతో ఎన్ని సినిమాలు రాలేదు చెప్పండి ఇప్పటి వరకు… అనేక సార్లు అరిగిపోయి కరిగిపోయిన ఈ స్టొరీ పాయింట్ ని పెళ్లిసందD లాంటి క్లాసిక్ టైటిల్ ని తీసుకుని అతి సాధారణంగా ఎలాంటి స్పెషల్ ఎలిమెంట్స్ లాంటివి లేకుండా చాలా సింపుల్ గా తెరకెక్కించారు. హీరో రోషన్ తన రోల్ కి బాగా న్యాయం చేశాడు…

తన పెర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకోగా నటన పరంగా మంచి మార్కులే పడగా హీరోయిన్ క్యూట్ లుక్స్ తో పాటు గ్లామర్ గా కూడా మెప్పించింది. ఇక ఇతర స్టార్ కాస్ట్ మొత్తం ఫోర్స్ కామెడీతో ఆకట్టుకోవాలని చూసినా కొన్ని చోట్ల తప్ప పెర్ఫార్మెన్స్ అండ్ కామెడీ ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. సంగీతం బాగుండగా బ్యాగ్రౌండ్ పర్వాలేదు అనిపించింది.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఏమాత్రం ఇంప్రెస్ చేయలేదు… సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. డైరెక్షన్ విషయానికి వస్తే ఒరిజినల్ పెళ్లిసందడి లో ఉన్న స్పార్క్ ఏ మూలనా కూడా ఈ సినిమాలో లేదనే చెప్పాలి. రాఘవేంద్రరావు గారి స్టైల్ లో సీన్స్ వస్తూ ఉన్నప్పటికీ అవి ఏమాత్రం ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేక పోయాయి.

ఫస్టాఫ్ వరకు ఎలాగోలా పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ చెప్పడానికి కథ ఏమి లేకపోవడంతో సినిమా స్క్రీన్ ప్లే మరింత బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది, సినిమా ఏ దశలో కూడా ఒరిజినల్ దరిదాపుల్లోకి వెళ్ళలేక పోయింది… ఉన్నంతలో రిచ్ విజువల్స్ గుడ్ సాంగ్స్ అండ్ పిక్చరైజేషన్ డీసెంట్ ఫ్యామిలీ సబ్జెక్ట్ కాబట్టి సినిమా ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది.

పెళ్లిసందడిని మరిపిస్తుంది అన్న నమ్మకంతో వెళితే మట్టుకు నిరాశ చెందక తప్పదు, అలా కాకుండా ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే సినిమా ఎదో ఒకసారి కష్టం మీద చూడొచ్చు అనిపించవచ్చు… ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2 స్టార్స్…. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here