Home న్యూస్ పోకిరి రీ రిలీజ్ కలెక్షన్స్ అప్ డేట్….ఊహకందని భీభత్సం!!

పోకిరి రీ రిలీజ్ కలెక్షన్స్ అప్ డేట్….ఊహకందని భీభత్సం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2006 టైం లో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన ఇండస్ట్రీ హిట్ పోకిరి సినిమా 16 ఏళ్ల తర్వాత రీ మాస్టర్ వర్షన్ ని 4K లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా స్పెషల్ షోలతో భారీ ఎత్తున రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ అనుకున్న దానికన్నా డబుల్ ట్రిపుల్ అనిపించే రేంజ్ లో సొంతం అయ్యి దుమ్ము లేపింది సినిమా ఓవరాల్ గా…

మొత్తం మీద సినిమా 200 రేంజ్ లో షోలు అనుకున్నా మొత్తం మీద 370 కి పైగా షోలు ఓవరాల్ గా భారీ ఎత్తున పడగా చాలా షోలు హౌస్ ఫుల్స్ అవ్వగా చాలా సెంటర్స్ లో 70-80% రేంజ్ ఆక్యుపెన్సీని సొంతం చేసుకుని దుమ్ము లేపిన ఈ సినిమా…

టోటల్ ఓవర్సీస్ లో 16.5 వేల డాలర్స్ ని అంటే 13.10 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఓవరాల్ గా అన్ని షోలు కలుపుకుని సినిమా ట్రేడ్ లెక్కల అంచనా ప్రకారం 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని అంచనా వేస్తున్నారు. అఫీషియల్ ఏరియాల వారి లెక్క ఇంకా…

రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఓవరాల్ కలెక్షన్స్ ఈ రేంజ్ కి అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద ఇది ఓ చిన్న సినిమా టాక్ సూపర్ పాజిటివ్ గా ఉంటె మొదటి రోజు సాధించే రేంజ్ కలెక్షన్స్ అని చెప్పాలి. మొత్తం మీద మహేష్ బాబు పుట్టిన రోజు చరిత్రలో నిలిచిపోయే రేంజ్ లో రికార్డ్ సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here