బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమానే అయినా కూడా డీసెంట్ టాక్ ను సొంతం చేసుకున్న పోట్టేల్(Pottel Movie Collections) మంచి ప్రమోషన్స్ ని సొంతం చేసుకోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా డీసెంట్ జోరుని చూపెడుతుంది అనుకున్నా కూడా సినిమా కలెక్షన్స్ పరంగా పెద్దగా హోల్డ్ ని చూపించలేక నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి వీకెండ్ లో సినిమా 85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా టాక్ బాగున్నా కూడా మిగిలిన రన్ లో పెద్దగా ఏమి ఇంపాక్ట్ ను చూపించ లేక ఓవరాల్ గా 30 లక్షల రేంజ్ లోనే షేర్ ని…
సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది. మొత్తం మీద రన్ కంప్లీట్ అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సినిమా 1.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా గ్రాస్ పరంగా 2.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 2.7 కోట్ల రేంజ్ లో షేర్నీ అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా ఓవరాల్ గా వాల్యూ టార్గెట్ లో సగం కూడా రికవరీ చేయలేక పరుగును డిసాస్టర్ గా కంప్లీట్ చేసుకుంది..
డీసెంట్ ప్రమోషన్స్, డీసెంట్ టాక్ ఆడియన్స్ నుండి వచ్చినా కూడా ఏమాత్రం హోల్డ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక పోయింది సినిమా….దీపావళి మూవీస్ రిలీజ్ అండ్ వాటి సినిమాల పాజిటివ్ టాక్ ఇంపాక్ట్ ఈ సినిమా మీద పడి అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేక పోయింది.