బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకే రోజు కుప్పలు తెప్పలుగా సినిమాలు రిలీజ్ అయితే జనాలు ఏ సినిమాకి వెళ్ళాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు, అండ్ దానికి తోడూ బారత్ బంద్ ఎఫెక్ట్ కూడా తొలి షోలకు ఇబ్బంది పెట్టగా అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బిలో పార్ ఓపెనింగ్స్ నే సొంతం చేసుకున్నాయి, ఒక్క సందీప్ కిషన్ కొత్త సినిమా ఏ1 ఎక్స్ ప్రెస్ ఒక్కటే కొంచం బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…
మిగిలిన నోటబుల్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు దిమ్మతిరిగే రేంజ్ లో చిల్లర కలెక్షన్స్ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చాయి, వాటిలో కొంచం క్రేజ్ ఉన్న రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ పవర్ ప్లే కూడా చిల్లర కలెక్షన్స్ తో రాజ్ తరుణ్..
ప్రస్తుత ఫాం ఎలా ఉందో చెప్పకనే చెప్పింది, ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 6 లక్షల లోపే షేర్ ని సొంతం చేసుకుంది, అందులో కూడా కొన్ని చోట్ల డెఫిసిట్ లు నెగటివ్ షేర్ లు వచ్చాయి కానీ ఆ కలెక్షన్స్ ని కూడా కలిపే ఈ లెక్క వచ్చింది.
ఇక దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ షాదీ ముబారక్ మూవీ బిజినెస్ ఎక్కువ సొంతం చేసుకున్నా కలెక్షన్స్ పరంగా చిల్లర కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఫస్ట్ డే కేవలం 4 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది, ఇక ఏ1 ఎక్స్ ప్రెస్ తర్వాత మిగిలిన సినిమాల్లో బెటర్ టాక్ అండ్ రివ్యూలు సొంతం చేసుకున్న ప్లే బాక్ మూవీ పోటి తీవ్రంగా ఉండటంతో..
మొదటి రోజు 3 లక్షల రేంజ్ షేర్ తోనే సరిపెట్టుకుంది, డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ అండ్ సినిమా బాగుంది కాబట్టి సినిమా రానున్న రోజుల్లో మౌత్ టాక్ తో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, మొదటి రోజు మాత్రం ఈ సినిమాలు చిల్లర కలెక్షన్స్ తోనే సరిపెట్టుకోగా మిగిలిన సినిమాలు అన్నీంటికీ నెగటివ్ షేర్స్ వచ్చాయి అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు.