Home న్యూస్ ఆదిపురుష్ టీసర్ రివ్యూ….భారీ విజువల్ వండర్…కానీ!!

ఆదిపురుష్ టీసర్ రివ్యూ….భారీ విజువల్ వండర్…కానీ!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీస్ లో ఆది పురుష్ సినిమా పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి…. సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో చాలా తక్కువ వర్కింగ్ డేస్ లో కంప్లీట్ చేసిన డైరెక్టర్ గ్రాఫిక్స్ కోసం ఎక్కువ టైం తీసుకోగా సినిమా అఫీషియల్ లుక్ ని అండ్ టీసర్ ను రీసెంట్ గా అయోధ్యలో ఈవెంట్ జరిపి అక్కడ రిలీజ్ చేశారు…

ఆ టీసర్ లో ప్రభాస్ లుక్ పై కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ అయితే వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు, ఆదిపురుష్ లో ప్రభాస్ ఇలా ఉండబోతున్నాడు, అలా ఉండబోతున్నాడు అంటూ ఫ్యాన్ మేడ్ పోస్టర్ లు చాలా రిలీజ్ అయ్యాయి…

అవన్నీ ఒకటికి మించి ఒకటి ఉండటంతో అఫీషియల్ లుక్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ అనుకున్నారు కానీ అలాంటిదేమీ జరగలేదు… బాహుబలిలో ప్రభాస్ లుక్ కి ఇప్పుడు ఆది పురుష్ లో లుక్ కి కంపేర్ చేస్తే పాస్ మార్కులు కూడా కష్టమే… ఇక టీసర్ ను భారీ గ్రాఫిక్స్ తో రూపొందించాము అని చెప్పారు కానీ….

టీసర్ ను జస్ట్ HD వర్షన్ లో రిలీజ్ చేయడంతో గ్రాఫిక్స్ ఏం అనుకున్న రేంజ్లో లేవు. 4K లో రిలీజ్ చేసి ఉంటే గ్రాఫిక్స్ క్వాలిటీ ఇంకా బాగా కనిపించి ఉండేది, ఓవరాల్ గా సినిమా ఓ విజువల్ వండర్ లా ఉండబోతుంది కానీ ఈ టీసర్ మట్టుకు ఆడియన్స్ లో ఓ మిక్సుడ్ ఫీలింగ్స్ ని కలిగించింది అని చెప్పాలి.

సీతగా కృతి సనన్ 2 సీన్స్ లో కనిపించగా రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ తన మార్క్ స్క్రీన్ ప్రజెన్స్ తో మెప్పించాడు, మెయిన్ లీడ్ తప్పితే మిగిలిన వాళ్ళు అందరూ మోషన్ కాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఆది పురుష్ చూడటానికి భారీ విజువల్ వండర్ లా అనిపించినా క్వాలిటీ పరంగా ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మరి రిలీజ్ టైం కి టీం ఇంకా బాగా సినిమాను తీర్చిదిద్దాలని కోరుకుందాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here