Home న్యూస్ టాలీవుడ్ ని భుజాన మోస్తున్న ఒకే ఒక్కడు ప్రభాస్!!

టాలీవుడ్ ని భుజాన మోస్తున్న ఒకే ఒక్కడు ప్రభాస్!!

0

తెలుగు సినిమా ఇండస్ట్రీకి కథల కొరత, డైరెక్టర్ ల కొరత ఎప్పటి నుండో ఉంది, అది ఇతర ఇండస్ట్రీలకు కూడా ఉన్నప్పటికీ మన దగ్గర స్టార్స్ ఎక్కువ ఉండటంతో కథల కొరత ఉన్నా కూడా ఒకప్పుడు అందరూ హీరోలు వరుస పెట్టి సినిమాలు చేసేవాళ్ళు. అందులో కొన్ని హిట్ అయ్యేవి, కొన్ని ఫ్లాఫ్ అయ్యేవి కానీ ఇయర్ లో అందరు స్టార్స్ వి కాక పోయినా కూడా…

ఒకరిద్దరివి తప్పితే మిగిలిన హీరోల సినిమాలు వస్తూనే ఉండేవి, థియేటర్స్ కి మంచి ఫీడింగ్ ఉండేది….కానీ ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమాల క్రేజ్ మొదలు అయ్యిందో అప్పటి నుండి చిన్నా పెద్ద అని తేడా లేకుండా అందరూ పాన్ ఇండియా మూవీస్ కే మొగ్గు చూపుతూ సినిమాలనే తగ్గించేస్తున్నారు….దాంతో అసలు స్టార్స్ నటించిన సినిమాలు ఎప్పుడో కానీ…

థియేటర్స్ లో సందడి చేయడం లేదు, కోవిడ్ టైంలో అంటే అప్పటి పరిస్థితుల వలెనే డిలే అయ్యాయి అనుకోవచ్చు, కానీ కోవిడ్ అయిపోయి 3 ఏళ్ళు కావొస్తున్నా కూడా మన స్టార్స్ నటించిన సినిమాలు చాలా తక్కువే రిలీజ్ అయ్యాయి.. సీనియర్స్ పర్వాలేదు కానీ టాప్ స్టార్స్ మాత్రం మరీ ఒక్కో సినిమాకి ఏళ్లకి ఏళ్ళు టైం తీసుకుంటున్నారు…

కోవిడ్ తర్వాత నుండి చూసుకుంటే పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్స్ లో ముందు నిలిచిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఒక్కడే ఎక్కువ సినిమాలను రిలీజ్ చేశాడు….కోవిడ్ తర్వాత రాదే శ్యామ్, ఆదిపురుష్, సలార్ ఇప్పుడు కల్కి ఆల్ మోస్ట్ 4 సినిమాలను రిలీజ్ చేశాడు…అందులో లాస్ట్ జూన్ నుండి ఈ జూన్ వరకు…

ప్రభాస్ నటించిన సినిమాలు 3 రిలీజ్ అయినట్లు లెక్క…అన్ని సినిమాలు భారీ బడ్జెట్ తో చేస్తున్న సినిమాలే…అందులో రాదే శ్యామ్ ఒక్కటి అత్యంత తీవ్రంగా నిరాశ పరిచింది…మిగిలిన 2 సినిమాల ఓవరాల్ రెవెన్యూ బాగానే ఉంది, ఇప్పుడు కల్కి కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమానే….మిగిలిన స్టార్స్ ఈ గ్యాప్ లో ఒకటి అరా సినిమాలు తప్పితే…

ఏమాత్రం ప్లానింగ్ లేకుండా సినిమాలు చేస్తున్నారు….ఒకప్పుడు స్టార్స్ ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు పాన్ ఇండియా మోజులో పడి ఒక్కో సినిమాకి చాలా టైం తీసుకుంటున్నారు…అదే టైంలో లాస్ట్ రెండేళ్ళలో టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలతో ప్రభాస్ ఒక్కడు తన భుజాన బరువును మోస్తున్నాడు…

AP-TG 9th Day Highest Share Movies

తన తర్వాత సినిమాలు కూడా ఒకటి తర్వాత ఒకటి సెట్స్ మీదకి వెళుతూ ఉంటే మిగిలిన స్టార్స్ ఒక సినిమా తర్వాతే మరో సినిమా కోసం ఆలోచిస్తున్నారు…ఈ ఆలోచన మారకపొతే ఆడియన్స్ ఇక థియేటర్స్ రావడం ఇంకా తగ్గించే ప్రమాదం ఉంది…మరి మన స్టార్స్ ఈ విషయాన్నీ ఎప్పటికి గ్రహిస్తారో…..తమ పీక్ క్రేజ్ ను వేస్ట్ చేసుకోకుండా ఎక్కువ సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తారో లేదో చూడాలి.

అదే టైంలో అందరి కన్నా ముందు పాన్ ఇండియా స్టేటస్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మిగిలిన స్టార్స్ తో పోల్చితే తక్కువ టైం గ్యాప్ లోనే ఆడియన్స్ ముందుకు వస్తూ ఉండటం విశేషం. మిగిలిన స్టార్స్ కూడా ప్రభాస్ ను ఈ విషయంలో చూసి నేర్చుకోవాల్సిన  అవసరం ఎంతైనా ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here