యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో బాహుబలి సినిమా తర్వాత అత్యంత భారీ అంచనాలతో రూపొందిన సినిమా సాహో, బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి ఆటకే నెగటివ్ టాక్ తెచ్చుకున్నా కానీ సాలిడ్ కలెక్షన్స్ ని ఇక్కడ సాధించినా హిందీ లో ఏకంగా సూపర్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది, అలాంటి సినిమా తర్వాత జపాన్ లో కూడా రిలీజ్ అయ్యి ఏకంగా 250 రోజుల రన్ తో ఊచకోత అంటే ఇదీ అనిపించుకుంది.
కానీ తెలుగు లో సినిమా టెలివిజన్ ప్రీమియర్ ని చాలా ఆలస్యంగా వేయడం తో మొదటి సారి నుండి షాకింగ్ టి.ఆర్.పి రేటింగ్ లను సాధిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా మూడో సారి ప్రైమ్ టైం లో టెలికాస్ట్ అయినా కానీ మరోసారి నిరాశ పరిచే రేటింగ్ నే సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది.
సినిమాను జీ తెలుగు లో వాళ్ళు 14.5 కోట్ల రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. కాగా సినిమా టెలివిజన్ లో మొదటి సారి టెలికాస్ట్ అయిన టైం లో 5.81 రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది, స్టార్ హీరోలలో వన్ ఆఫ్ ది లోవేస్ట్ రేటింగ్ ని అందుకున్న సినిమాలలో…
ఒకటిగా నిలిచిన ఈ సినిమా రెండో సారి కూడా తర్వాత వారమే టెలికాస్ట్ అవ్వగా రెండో సారి సినిమా కి 4.11 రేటింగ్ మాత్రమే దక్కింది, దాంతో మరోసారి దెబ్బ పడినట్లు అవ్వగా రీసెంట్ గా సినిమా మరోసారి టెలికాస్ట్ అవ్వగా ఈ సారి ఈవినింగ్ స్లాట్ లో సినిమాను టెలికాస్ట్ చేశారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోవడం తో మూడో సారి సినిమా కి..
3.71 రేటింగ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది, మొత్తం మీద సినిమా 3 సార్లు టెలికాస్ట్ అయినా కానీ నిరాశ పరిచే రేటింగ్ లనే సొంతం చేసుకోవడంతో పాటు పెట్టిన 14.5 కోట్లు రికవరీ అవ్వాలి అంటే ఇప్పట్లో కష్టంగానే కనిపిస్తుంది అని చెప్పాలి, ఇలాంటి రేటింగ్ లు మరో 5 నుండి 8 సార్ల రేంజ్ లో టెలికాస్ట్ అయ్యి సాధిస్తేనే టెలివిజన్ రైట్స్ కొన్న ఛానెల్ రికవరీ అవుతుంది.