Home న్యూస్ రాదే శ్యామ్ 42.6, ఆదిపురుష్ 68.9…సలార్ 83…సామి శిఖరం కాదు…పర్వతం!!

రాదే శ్యామ్ 42.6, ఆదిపురుష్ 68.9…సలార్ 83…సామి శిఖరం కాదు…పర్వతం!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సినిమా సినిమాకి ఇండియాలో తిరుగులేని హీరోలా దూసుకు పోతున్నాడు. హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా ప్రభాస్ సినిమాల క్రేజ్ ఏళ్లలు దాటిపోతుంది. ప్రభాస్ సినిమాల బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ రికార్డులు తిరగరాస్తూ ఉండగా….

ఆ సినిమాల సోషల్ మీడియా రికార్డులు కూడా ఊచకోత కొస్తున్నాయి. ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్(Salaar) అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఊహకందని రికార్డ్ వ్యూస్ ని మొదటి 24 గంటల్లో సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది ఇప్పుడు.

ఏకంగా 83 మిలియన్స్ అప్ డేట్ అయిన వ్యూస్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక ప్రభాస్ ప్రీవియస్ మూవీస్ కూడా ఇవే రేంజ్ లో యూట్యూబ్ లో టీసర్ ల పరంగా ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేయడం విశేషమని చెప్పాలి. ప్రభాస్ రాదే శ్యామ్(Radhe Shyam) మూవీ టీసర్…

తెలుగు వర్షన్ ఏకంగా 42.66 మిలియన్స్ వ్యూస్ ని సొంతం చేసుకుని తెలుగు వరకు ప్రస్తుతానికి అన్ బ్రేకబుల్ రికార్డ్ ను సృష్టించింది. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రభాస్ ఆదిపురుష్(AdiPurush) సినిమా హిందీ టీసర్ 68.96 మిలియన్స్ వ్యూస్ తో…

ఇండియన్ మూవీస్ టీసర్ లలో కొత్త రికార్డ్ ను నమోదు చేయగా ఇప్పుడు తన రికార్డ్ ను తానె బ్రేక్ చేసిన ప్రభాస్ సలార్ టీసర్ అన్ని భాషలకు ఒకే టీసర్ రిలీజ్ చేయగా 24 గంటల్లో 83 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసి ప్రభాస్ క్రేజ్ పవర్ ని చూపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here