చేసింది తక్కువ సినిమాలే అయినా కానీ విలక్షణ కాన్సెప్ట్ లను ఎంచుకుంటూ వాటికి కొంచం కమర్షియల్ హంగులను కూడా జోడించి సినిమాలను ఆడియన్స్ కి నచ్చేలా రూపొందిస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ తెలుగు లో మొట్ట మొదటి సారిగా జోంబీల నేపధ్యంలో రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరిలో ఆడియన్స్ ముందుకు రాగా మొదటి వారం….
సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా తర్వాత ఉప్పెన ఊపుని తట్టుకోలేక పోయింది, అయినా అప్పటికే బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ను తర్వాత స్టార్ మా ఛానెల్ వాళ్ళు 2 కోట్ల ఫ్యాన్సీ రేటు చెల్లించి హక్కులను…
సొంతం చేసుకున్నారు. సినిమా ఫస్ట్ టైం టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే సినిమాను ఆదరించారు. ఫస్ట్ టైమే పెట్టిన రేటుకి ఫుల్ న్యాయం చేస్తూ సినిమా ఏకంగా 9.7 TRP రేటింగ్ ను సొంతం చేసుకుని సత్తా చాటుకోగా సినిమా రీసెంట్ గా సెకెండ్ టైం కూడా టెలికాస్ట్ అవ్వగా…
ఈ సారి కూడా పెట్టిన రేటు కి ఊహకందని TRP రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. రెండో సారి కూడా సినిమా 8.1 TRP రేటింగ్ ను సొంతం చేసుకుని సత్తా చాటుకోగా… సినిమాను అమ్మిన రేటు 2 కోట్లకు సినిమా ఛానెల్ కి ఆల్ మోస్ట్ డబుల్ ట్రిపుల్ ప్రాఫిట్స్ ను మొదటి 2 సార్ల టెలివిజన్ రేటింగ్స్ తో దుమ్ము లేపింది.
ఈ రేంజ్ లో టెలివిజన్ లో సినిమా సక్సెస్ అవ్వడం విశేషమే, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ కాన్సెప్ట్ మూవీస్ ని ఈ రేంజ్ లో చూస్తారు అని ఎవ్వరూ అనుకుని ఉండరు, కామెడీని మిక్స్ చేస్తూ ఈ కాన్సెప్ట్ కి ఫాక్షన్ కి కూడా జోడిస్తూ మొత్తం మీద ఆడియన్స్ ను సూపర్ గా అలరించిన సినిమా అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు టెలివిజన్ లో కూడా అల్టిమేట్ సక్సెస్ గా నిలిచింది.