Home న్యూస్ ప్రేమ కథా చిత్రం 2 రివ్యూ- పారిపొండిరోయ్!

ప్రేమ కథా చిత్రం 2 రివ్యూ- పారిపొండిరోయ్!

0

     6 ఇయర్స్ కి ముందు వచ్చిన ప్రేమ కథా చిత్రం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, హర్రర్ కామెడీ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమా ఇది, అలాంటి సినిమా కి సీక్వెల్ అంటే ఎలాంటి కథ ని ఎంచుకోవాలి, సినిమా ఎలా తీయాలి, కానీ 6 ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ చూస్తె మాత్రం ఇప్పుడే కెమరా పట్టుకోవడం మొదలు పెట్టిన వాళ్ళు కూడా ఇంతకన్నా బాగా తీస్తారేమో అనిపించే విధంగా ఉంది సినిమా.

స్టొరీ పాయింట్: హీరో నడిపే డాన్స్ స్కూల్ లో తనని చూసి ఇష్టపడే హీరోయిన్ 1 తన ప్రేమ ని హీరోయిన్ కి చెబితే హీరో నో చెబుతాడు, దాంతో ఆ హీరోయిన్ ఆత్మహత్యయత్నం చేస్తుంది, తర్వాత రెండో హీరోయిన్ తో ప్రేమల్ ఓ ఉండే హీరో కి చుక్కలు చూయిస్తుంది ఆ ఆత్మా.

ఆ ఆత్మా నుండి హీరో హీరోయిన్స్ ఎలా బయట పడ్డారు అన్నది మిగిలిన స్టొరీ, హర్రర్ కామెడీ చూసి చూసి అందరికీ విసుగు వచ్చేసింది, అయినా అదే టెంప్లెట్ ని వాడుకున్న ఈ టీం ఏమాత్రం ఆకట్టుకోలేని స్క్రీన్ ప్లే తో విసుగు పుట్టించే నరేషన్ తో షాక్ ఇస్తుంది.

నటులుగా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్ – నందిత శ్వేత ఈ కథ ని ఎందుకు ఒప్పుకున్నారో వాళ్ళకే తెలియాలి, వీళ్ళ నుండి దర్శకుడు రాబట్టిన నటన కి అసలు మార్కులు కూడా వేయలేం, ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ప్రేక్షకుల్లో రిజిస్టర్ కాదు.

సినిమా రీసెంట్ టైం లో తీవ్ర నిరాశ పరిచిన సినిమాలలో ఒకటిగా చెప్పుకోవాలి, మొదటి పార్ట్ అమృతం అయితే రెండో పార్ట్   కింద మంచి నీళ్ళు కూడా కాదని చెప్పాలి, ఈ వీకెండ్ ఈ మూవీ ని చూడాలని ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ ని వెంటనే విరమించుకోవడం బెటర్… సినిమా కి ఫైనల్ రేటింగ్ 1 స్టార్!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here