మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా సినిమా ఓపెనింగ్స్ పరంగా తమిళనాడులో అలాగే ఓవర్సీస్ లో సెన్సేషనల్ స్టార్ట్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే రిలీజ్ కి ముందు రోజు ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ గ్రాస్ 1.5 కోట్ల మార్క్ ని అందుకోగా రిలీజ్ రోజున మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకి…
ఆల్ మోస్ట్ ఆక్యుపెన్సీ 30% రేంజ్ లో ఉండగా కొన్ని చోట్లా బెటర్ గా హోల్డ్ చేసినా మిగిలిన చోట్ల యావరేజ్ ఓపెనింగ్స్ ని అందుకుంది. మొత్తం మీద డే 1 మొత్తం ఇదే రేంజ్ లో సినిమా హోల్డ్ చేస్తే 1.5 కోట్ల రేంజ్ లో…
షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి డే ఎండ్ అయ్యే టైం కి హోల్డ్ చేసే రేంజ్ ని బట్టి కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో రిలీజ్ కి ముందు రోజు ఫైనల్ గ్రాస్ 13 కోట్ల మార్క్ ని అందుకోగా…
తొలిరోజు ఇప్పుడు అక్కడ 22 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక కర్ణాటక అండ్ కేరళలో 3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా హిందీ లో మాత్రం కోటి రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా టోటల్ ఇండియా లో సినిమా 35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…
ఓవర్సీస్ లో మాత్రం సెన్సేషనల్ స్టార్ట్ ను అందుకోగా సినిమా 25 కోట్లకు తగ్గని గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద కోలివుడ్ మూవీస్ పరంగా వన్ ఆఫ్ బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక డే 1 ఎండ్ అయ్యే టైం కి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.