బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ శుక్రవారం భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న కోలివుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 పై అక్కడ విపరీతమైన అంచనాలు ఉన్నాయి కానీ మిగిలిన చోట్ల ఇప్పుడిప్పుడే అంచనాలను పెంచుకుంటున్న ఈ సినిమా మౌత్ టాక్ పైన ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాను ఇప్పుడు భారీగానే రిలీజ్ చేయడానికి…
సన్నాహాలు చేస్తూ ఉండగా సినిమా ఓవరాల్ గా సాధించిన బిజినెస్ కూడా సాలిడ్ గానే ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న టైం లో మరీ అంత ఆసక్తిని క్రియేట్ చేయని కంటెంట్ తో ప్రమోషన్స్ ని జరుపుకున్న పొన్నియన్ సెల్వన్ 1 కచ్చితంగా మౌత్ టాక్ తో…
బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్… తెలుగు లో ఈ సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉండగా సినిమా మొత్తం మీద నైజాం ఏరియా లో 3.5 కోట్ల రేంజ్ బిజినెస్ ను సీడెడ్ లో 2 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా ఆంధ్ర రీజన్ లో…
4.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. దాంతో సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 10 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుందని సమాచారం. దాంతో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో హిట్ గీతని దాటాలి అంటే మినిమమ్ 10.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
మరి సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు మ్యాజిక్ ని చూపిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. తమిళ్ లో మట్టుకు ఎక్స్ లెంట్ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అక్కడ సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని అంటూ ఉండటం విశేషం.