మొదటి పార్ట్ సక్సెస్ అయితే రెండో పార్ట్ పై అంచనాలు ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఓ రేంజ్ లో ఉంటుంది, కానీ దీనికి పూర్తిగా విరుద్దంగా ఇప్పుడు కోలివుడ్ ఇండస్ట్రీ హిట్ అయిన పొన్నియన్ సెల్వన్ 1 సినిమా కి కొనసాగింపుగా వస్తున్న పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ఆడియన్స్ ముందుకు అతి త్వరలో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై తమిళనాడులోనే ఓ ఇండస్ట్రీ హిట్ సీక్వెల్ కి ఉండాల్సిన క్రేజ్…
ఇంకా సొంతం అవ్వలేదు… ఇక ఇతర భాషలలో అయితే మినిమమ్ బజ్ కూడా లేదనే చెప్పాలి. ఇక సినిమా పాటలు కూడా పెద్దగా ఆడియన్స్ ను అలరించలేక పోగా బిజినెస్ పరంగా సీక్వెల్ మూవీస్ కి ఉండాల్సిన హైప్ అసలు ఈ సినిమాకి సొంతం అవ్వలేదు అని చెప్పాలి ఇప్పుడు.
మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో సినిమా బిజినెస్ రేంజ్ కనీసం 15 కోట్ల రేంజ్ లో అయినా ఉంటుంది ఏమో అనుకున్నారు కానీ ఆ రేటు కాదు కదా మొదటి పార్ట్ వర్త్ బిజినెస్ 10 కోట్ల మార్క్ ని కూడా ఇవ్వడానికి ఏ బయ్యర్ కూడా సిద్ధంగా లేడని ట్రేడ్ లో సమాచారం. దాంతో చేసేది ఏమి లేక…
తెలుగు లో పెర్సెంటేజ్ బేస్ మీద సినిమాను ఇప్పుడు రిలీజ్ చేసే క్రమంలో టీం ఉన్నారని తెలుస్తుంది. రీసెంట్ టైం లో ఒక ఇండస్ట్రీ హిట్ సీక్వెల్ కి బిజినెస్ లేక పోవడం ఒక్క ఈ సినిమాకే చెల్లింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అయినా సినిమా ప్రభావం చూపుతుందో లేదో చూడాలి.