Home న్యూస్ 70 కూడా కాదు…ఏజెంట్ బడ్జెట్ ఎంతో చెప్పేసిన నిర్మాత…టాప్ 2 తో రికార్డ్!

70 కూడా కాదు…ఏజెంట్ బడ్జెట్ ఎంతో చెప్పేసిన నిర్మాత…టాప్ 2 తో రికార్డ్!

0

కెరీర్ మొదలు పెట్టిన 5 ఏళ్లకి తొలి హిట్ ని సొంతం చేసుకున్న అఖిల్ అక్కినేని, తాను కోరుకున్న మాస్ హిట్ మాత్రం ఇప్పుడు ఏజెంట్ మూవీతో సొంతం చేసుకుంటాడు అన్న నమ్మకంతో ఉండగా ఏజెంట్ మూవీ ఆడియన్స్ ముందుకు ఈ నెల 28న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా బడ్జెట్ ఇప్పుడు ఆల్ మోస్ట్ స్టార్ హీరోల రేంజ్ లో ఉండగా ఓవరాల్ గా టాలీవుడ్ లో మీడియం రేంజ్…

హీరోల పరంగా చూసుకుంటే ఇది ఆల్ టైం సెకెండ్ హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా అని చెప్పాలి. కాగా సినిమా బడ్జెట్ ముందు 50 కోట్ల లోపు అనుకున్నా కానీ తర్వాత బడ్జెట్ పెరిగి పెరిగి 70 కోట్ల దాక అయ్యిందని ట్రేడ్ లో రీసెంట్ గా టాక్ వచ్చినప్పటికీ కూడా…

ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్ ఏకంగా అసలు బడ్జెట్ ని చెప్పేశారు. ఏకంగా 80 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమా నిర్మాణం అయ్యిందని తెలియజేశారు. ఇక ప్రమోషన్స్, ప్రింట్ ఖర్చులు లాంటివి అన్నీ కలిపి సినిమా ఏకంగా 85 కోట్ల దాకా బడ్జెట్ అయ్యి ఉంటుందని అంచనా…

ఓవరాల్ గా టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా విజయ్ దేవరకొండ లైగర్ మూవీ 100 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కగా ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఏజెంట్ మూవీ సెకెండ్ హైయెస్ట్ బడ్జెట్ మీడియం రేంజ్ మూవీ అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here