డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలు అంటే చాలు ఆడియన్స్ లో మంచి అంచనాలు ఎప్పటికీ ఉంటాయి, కెరీర్ మొదలు పెట్టడం వరుస విజయాలతో మొదలు పెట్టిన పూరీ జగన్నాథ్, బద్రీ, ఇట్లు శ్రావని సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఒక తమిళమ్మాయి ఇలా వరుస పెట్టి విజయాలతో ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగి పోకిరి సినిమా తో ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసి దేశముదురు తో మరో…
అల్టిమేట్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుని తర్వాత అడపాదడపా హిట్స్ కొడుతూ వస్తున్నా తన కంటెంట్ లో మాస్ ఎలిమెంట్స్ పెరిగి స్టొరీ తగ్గిపోతూ మధ్యలో ఫామ్ కోల్పోతూ వచ్చిన పూరీ జగన్నాథ్ బిజినెస్ మాన్, టెంపర్ సినిమాతో మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు, తర్వాత మళ్ళీ ఫ్లాఫ్స్ కంటిన్యూగా వస్తున్న టైం లో…
రామ్ తో ఇస్మార్ట్ శంకర్ తో స్ట్రాంగ్ మాస్ హిట్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు లైగర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్ మూవీ చేస్తున్న పూరీ మధ్యలో బాలీవుడ్ లో బుడ్డా హోగా తేరా బాప్ అంటూ అమితాబ్ తో కూడా హిట్ కొట్టాడు. రీసెంట్ గా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ…
తన కెరీర్ లో చాలా సినిమాలు ఫ్లాఫ్స్ గా నిలిచాయి కానీ, ఏ సినిమా విషయం లో ఎక్కువగా భాదపడి ఈ సినిమా తీయకుండా ఉంటే బాగుండేది అనిపించింది అంటే అంటూ చెబుతూ రవితేజ తో చేసిన దేవుడు చేసిన మనుషులు సినిమా అంటూ చెప్పుకొచ్చాడు. రవితేజ ఆల్ రెడీ 3 హిట్స్ కొట్టి నేనింతే ఫ్లాఫ్ అయిన మంచి పేరు సొంతం చేసుకోగా ఇడియట్ సినిమా సీక్వెల్ కి…
కథ రాసుకున్నామని కానీ అది ఎందుకో అనుకున్న విధంగా తయారు కాలేదని డౌట్ వచ్చి సడెన్ గా కథ అనేది లేకుండా దేవుడు చేసిన మనుషులు సినిమా తీశామని, ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పుకొచ్చాడు పూరీ… ఈ సినిమా పై ఆ టైం లో అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే డిసాస్టర్ గా నిలిచింది ఈ సినిమా.