కెరీర్ మొదట్లో వరుస హిట్స్ తో మంచి జోరు చూపించి త్వరలోనే మీడియం రేంజ్ హీరోల రేంజ్ కి ఎదుగుతాడు అనిపించుకున్న రాజ్ తరుణ్(Raj Tarun) సరైన కథలను ఎంచుకునే విషయంలో కంప్లీట్ గా వెనకబడిపోయి సినిమా సినిమాకి తన మార్కెట్ ను పూర్తిగా కోల్పోయి ఇప్పుడు కనీసం తన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అన్న విషయం కూడా…
జనాలకు తెలియని పరిస్థితిని తెచ్చుకోగా రీసెంట్ టైంలో తన కెరీర్ లో బడ్జెట్ కొంచం ఎక్కువగా పెట్టి తీసిన పురుషోత్తముడు(Purushothamudu Movie Collections)మూవీ లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ అవ్వగా ఈ విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసు…
ఇక సినిమా ట్రైలర్ రిలీజ్ తో మినీ శ్రీమంతుడులా అనిపించినా ఆడియన్స్ నుండి మాత్రం కంప్లీట్ గా మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా థియేటర్స్ కి జనాలను రప్పించలేక పోయింది. దాంతో ఓవరాల్ గా వీకెండ్ మొత్తం మీద చూసుకుంటే…
పట్టుమని 12 వేల టికెట్ సేల్స్ కూడా ఆన్ లైన్ లో జరగలేదు… ఓవరాల్ గా ట్రాక్ చేసిన కొన్ని సెంటర్స్ ను బట్టి వీకెండ్ లో అటూ ఇటూగా సినిమా 55-60 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుందని అంచనా వేయవచ్చు….అందులో కూడా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి…
ఉంటాయి కాబట్టి అవన్నీ తీసేస్తే వర్త్ షేర్ రేంజ్ 25-30 లక్షలు ఉండటం కూడా కష్టమే….ఓవరాల్ గా సినిమా బడ్జెట్ కొంచం ఎక్కువే అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ 1.5 కోట్లకు పైగా అయినా వసూళ్ళని అందుకోవాల్సి ఉంటుంది. కానీ సినిమా పరిస్థితి చూస్తూ ఉంటే మినిమమ్ ఇంపాక్ట్ కూడా ఉండే అవకాశం కనిపించడం లేదు ఇప్పుడు.