Home న్యూస్ పుష్ప2 కొట్టలేదు….దేవర కొడుతుందా లేదా!!

పుష్ప2 కొట్టలేదు….దేవర కొడుతుందా లేదా!!

0

టాప్ స్టార్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అంటే ఆ సినిమాల టీసర్ లు, ట్రైలర్ లే కాదు సినిమాల సాంగ్స్ కి కూడా ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు….రీసెంట్ టైంలో మంచి క్రేజ్ ఉన్న సినిమాల నుండి సాంగ్స్ తక్కువగానే వస్తూ ఉండగా….

రీసెంట్ టైంలో కోలివుడ్ నుండి దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం నుండి సాంగ్ వచ్చింది… ఆ సాంగ్ వ్యూస్ పరంగా సౌత్ రికార్డ్ ను నమోదు చేయగా లైక్స్ పరంగా ఆల్ రెడీ విజయ్ పేరిటే రికార్డ్ కొనసాగుతుంది. ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తుంది అన్నట్లు అనిపించినా పాన్ ఇండియా క్రేజీ మూవీ…

అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప2(Pushpa 2 The Rule) మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వగా సౌత్ రికార్డులు టాలీవుడ్ రికార్డులు ఏవి కూడా క్రియేట్ చేయలేదు…దాంతో మోస్ట్ క్రేజీ మూవీ పుష్ప2 ఫస్ట్ సాంగ్ అంచనాలను అందుకోలేక పోగా ఇప్పుడు మరో క్రేజీ పాన్ ఇండియా మూవీ సాంగ్ రిలీజ్ కానుంది…

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర(Devara Part 1) నుండి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. సౌత్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించడంతో సాంగ్ మీద క్రేజ్ మరో లెవల్ లో ఉండగా ఈ సాంగ్ ఇప్పుడు ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు…

సాంగ్ జైలర్ మూవీ లోని హుకుం మూవీకి మించి ఉంటుంది అంటూ ఆల్ రెడీ హైప్ ను మరో లెవల్ లో పెంచుతూ ఉండగా సాంగ్ కచ్చితంగా టాలీవుడ్ తో పాటు సౌత్ లిరికల్ వీడియోల రికార్డులను నమోదు చేస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. పుష్ప2 సాంగ్ రికార్డులు కొట్టలేక పోయింది. ఇక దేవర ఫస్ట్ సాంగ్ రికార్డులను క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here