Home న్యూస్ హౌస్ ఫుల్స్ తో ఓపెన్ అయిన అపరిచితుడు రీ రిలీజ్ డే 1 కలెక్షన్స్ అప్...

హౌస్ ఫుల్స్ తో ఓపెన్ అయిన అపరిచితుడు రీ రిలీజ్ డే 1 కలెక్షన్స్ అప్ డేట్!

0

విక్రమ్(Vikram) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన అపరిచితుడు(Aparichitudu Re Release) సినిమా 18 ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ లో తెలుగులో ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుంది…తెలుగులో డబ్ అయిన తమిళ్ మూవీస్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది….

పెర్ఫెక్ట్ ఎలిమెంట్స్ తో కమర్షియల్ అండ్ మెసేజ్ తో వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన అపరిచితుడు మూవీ తెలుగులో రిలీజ్ అయిన 18 ఏళ్ల తర్వాత రీసెంట్ గా రీ రిలీజ్ చేశారు. ఎలక్షన్స్ తర్వాత కొత్త సినిమాలు ఏమి లేక పోవడంతో ఉన్నంతలో అపరిచితుడు సినిమా రీ రిలీజ్ నే జనాలు ఎంజాయ్ చేస్తున్నారు…

Aparichitudu Re Release 1st Day Collections
భారీ రిలీజ్ ను ప్లాన్ చేశారు కానీ సింగిల్ స్క్రీన్స్ చాలా చోట్ల క్లోజ్ అవ్వగా లిమిటెడ్ రిలీజ్ ను అపరి చితుడు సినిమా  సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో ట్రాక్ చేసిన సెంటర్స్ లో మంచి ఓపెనింగ్స్ నే అందుకుందని చెప్పాలి ఇప్పుడు. హైదరాబాదు RTC X రోడ్స్ లో సినిమాకి ఈవినింగ్ షోలకి హౌస్ ఫుల్ బోర్డులు పడగా…

ఆంధ్ర సైడ్ కూడా సినిమా షోలకు మంచి ఆక్యుపెన్సీ నోటబుల్ థియేటర్స్ లో సొంతం అవ్వగా ఓవరాల్ గా మొదటి రీ రిలీజ్ లో సినిమా 16-18 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో సొంతం అయ్యింది అని చెప్పొచ్చు. 18 ఏళ్ల క్రితం ఓల్డ్ మూవీకి ఇలాంటి రెస్పాన్స్ సొంతం అవ్వడం విశేషం అనే చెప్పాలి. సినిమా వీకెండ్ లో మంచి జోరు చూపించే అవకాశం ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here