బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో టాలీవుడ్ నుండి భారీ విజయాలుగా నిలిచిన సినిమాలుగా అఖండ మరియు పుష్ప సినిమాలు నిలుస్తాయి అని చెప్పాలి…డిసెంబర్ నెల స్టార్టింగ్ లో అఖండ… క్రిస్టమస్ వీక్ కి ముందు వారంలో ఆడియన్స్ ముందుకు పుష్ప సినిమాలు రిలీజ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలు కూడా అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాయి. కాగా రెండు సినిమాల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో….
అఖండ ఒకటి 2 ఏరియాలు తప్పితే అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ అండ్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకోగా పుష్ప సినిమా ఒక్క నైజాంలో మాత్రమే బ్రేక్ ఈవెన్ అవ్వగా మిగిలిన ఏ ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు కానీ మిగిలిన స్టేట్స్ లో కలెక్షన్స్ తో సినిమా సేఫ్ అయింది.
ఇక ఈ రెండు సినిమాలను కూడా నైజాం ఏరియాలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు… కాగా పుష్ప సినిమా కోసం 36 కోట్ల రేటు చెల్లించాడు దిల్ రాజు, ఇక అఖండ సినిమా కోసం 10.5 కోట్ల రేంజ్ రేటు ని చెల్లించగా రెండు సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఎదురు చూడగా…
అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా పుష్ప సినిమా ఫస్ట్ డే టాక్ చూసి ఈ సినిమా నైజాంలో సేఫ్ అవుతుందో లేదో అన్న డౌట్స్ వచ్చాయట…. కానీ సినిమా లాంగ్ రన్ లో ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్స్ ను కూడా తెచ్చిపెట్టగా మొత్తం మీద పుష్ప సినిమా బిజినెస్ మీద 4.5 కోట్ల రేంజ్ లో…
ప్రాఫిట్ ఇవ్వగా బాలయ్య అఖండ మాత్రం ఏకంగా బిజినెస్ మీద 10.5 కోట్లకు పైగా ప్రాఫిట్ ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చినట్లు సమాచారం. రేటు పుష్ప ది ఎక్కువ అయినా లాభాల విషయంలో అఖండ ఊహకందని లాభాలను సొంతం అయ్యేలా చేసిందని దిల్ రాజు చెప్పారట… మొత్తం మీద 2 సినిమాలతో భారీ లాభాలు దిల్ రాజు సొంతం అయ్యాయి అని చెప్పాలి.