సౌత్ మూవీస్ హిందీ లో డబ్ అయ్యి ముందు టెలివిజన్ లో అలాగే తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ అవ్వడం రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకోవడం అన్నది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది, చాలా సినిమాలు ఇలానే చేసి అక్కడ రికార్డ్ వ్యూస్ తో దుమ్ము దుమారం లేపాయి. సౌత్ మూవీస్ లో ముఖ్యంగా టాలీవుడ్ మూవీస్ కి హిందీ లో అల్టిమేట్ క్రేజ్ ఉన్న విషయం అందరి కీ కూడా తెలిసిందే.
మన దగ్గర హిట్ ఫ్లాఫ్ అన్న తేడా లేకుండా హిందీ లో డబ్ అయిన సినిమాలు ఎక్కువ శాతం 100 మిలియన్ వ్యూస్ ని అవలీలగా సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. ఇక కొందరు హీరోల సినిమాలు అయితే మరిన్ని రికార్డులను నమోదు చేశాయి. వాళ్ళలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీస్…
ముందు నిలుస్తాయి అని చెప్పాలి. సరైనోడు దువ్వాడ జగన్నాథం లాంటి సినిమాలు హిందీ లో అల్టిమేట్ రికార్డులను నమోదు చేశాయి. ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా కి హిందీ లో కూడా రిలీజ్ చేయబోతుండగా తర్వాత రన్ కంప్లీట్ అయ్యాక యూట్యూబ్ లో డబ్ వర్షన్ ని రిలీజ్ చేస్తారట..
అందుకోసం రీసెంట్ గా హిందీ డబ్బింగ్ రేటు సాలిడ్ గానే ఆఫర్ చేశారని తెలుస్తుంది, మొత్తం మీద సినిమా కోసం 17.5 కోట్ల రేటు ని ఆఫర్ చేశారట. ఇది కొన్ని ఇతర సినిమాలతో పోల్చితే తక్కువ రేటు అనే చెప్పాలి కానీ ఇక్కడ గమనించాల్సిన్న విషయం ఏంటంటే… సినిమా ముందు హిందీ లో థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది, తర్వాత టెలివిజన్ లో వచ్చాక…..
డిజిటల్ రిలీజ్ అలాగే యూట్యూబ్ లో రిలీజ్ అవుతుంది. ఆ లెక్కన అప్పటికే ఎంతో మంది సినిమా చూసి ఉంటారు, అయినా కానీ 17.5 కోట్ల రేటు కి హిందీ డబ్బింగ్ రైట్స్ ని అమ్మడం అంటే అల్టిమేట్ అనే చెప్పాలి. ఇతర డబ్ మూవీస్ డైరెక్ట్ గా టెలివిజన్ లో తర్వాత యూట్యూబ్ లో వస్తాయి కాబట్టి రేటు ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇక్కడ అన్ని పనులు అయ్యాక వస్తున్నా ఈ రేంజ్ రేటు అంటే అల్లు అర్జున్ తన రేంజ్ ఎంటో చూపి అందరికీ గట్టి షాకే ఇచ్చాడు అని చెప్పొచ్చు.