బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ క్రిస్టమస్ టైం లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రైజ్ మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకున్నా లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అన్ని చోట్లా సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాలలో లో టికెట్ రేట్స్ వలన ఇబ్బందులు ఎదురు అయినా ఇతర రాష్ట్రాలలో మాత్రం….
సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపుతూ టోటల్ రన్ లో ఏకంగా 184.62 కోట్ల షేర్ ని అందుకోగా గ్రాస్ 360 కోట్ల మార్క్ ని అందుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా పరుగును ముగించిన తర్వాత ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా….
సినిమా డిజిటల్ రిలీజ్ తర్వాత మరింత క్రేజ్ ను సొంతం చేసుకోగా సినిమా పార్ట్ 2 పై మరింత అంచనాలు పెరిగి పోయాయి. కాగా పార్ట్ 1 తో పాటు పార్ట్ 2 కి సంభందించి కొద్ది వరకు షూటింగ్ ఆల్ రెడీ జరగడంతో మొత్తం మీద మొదటి పార్ట్ కి గాను 150 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో…
సినిమాను నిర్మించగా ఇప్పుడు పార్ట్ 2 కోసం బడ్జెట్ ను భారీగా పెంచి నిర్మించబోతున్నట్లు సమాచారం… మొదటి పార్ట్ కన్నా కూడా డబుల్ బడ్జెట్ ను పెంచాక కూడా ఇంకా బడ్జెట్ పెరిగి పోబోతుందని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం పార్ట్ 2 కోసం ఏకంగా 350 రేంజ్ లో బడ్జెట్ తో సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం.
ఈ రేంజ్ బడ్జెట్ తో భారీ లెవల్ లో సినిమాను నిర్మిస్తూ ఉండగా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోబోతుంది అంటున్నారు. ఈ రేంజ్ బడ్జెట్ తో రాబోతున్న సినిమాలో ఎలాంటి స్పెషాలిటీస్ ఉంటాయి అన్నది ఆసక్తి కరం కాగా ఇక సినిమా వచ్చే ఇయర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు….