ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబోలో పాన్ ఇండియా లెవల్ లో భారీ ఎత్తున రూపొందిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రైజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా సుమారు 3000 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా ప్రీమియర్ షోలను పూర్తీ చేసుకుని అక్కడ నుండి ఫస్ట్ టాక్ ఏంటి అనేది బయటికి వచ్చేసింది. మరి టాక్ ఎలా ఉందంటే….
స్టొరీ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకున్నా కానీ ఎర్ర చందనం స్మగ్లింగ్ లో కింగ్ అయిన విలన్ సునీల్ దగ్గర ఎర్రచందనమును అడవి లో నుండి సునీల్ దగ్గరకు తీసుకు వచ్చే లారీ డ్రైవర్ గా పని చేసే అల్లు అర్జున్ ఎలా అంచలంచలుగా ఎదిగి డాన్ గా మారాడు అన్నది..
ఓవరాల్ గా స్టొరీ పాయింట్ అయినా కానీ సినిమాలో వచ్చే ట్విస్ట్ లు కానీ యాక్షన్ సీన్స్ కానీ ఎలివేషన్ సీన్స్ కానీ మాస్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంటాయని, ఫస్టాఫ్ కథ సెట్ అవ్వడానికి టైం పట్టడంతో కొంచం బోర్ అనిపించినా కథ లో కి ఎంటర్ అయిన తర్వాత…
ఇంటర్వెల్ వరకు కథ అద్బుతంగా ఉంటుందని, సాలిడ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగి పోగా సెకెండ్ ఆ అంచనాలను అందుకునేలా ఉన్నప్పటికీ కథ నెమ్మదిగా సాగుతుందని, లెంత్ కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్, మెయిన్ కథ ఈజీగా చెప్పే విధంగా ఉండటం లాంటివి అలాగే కథ మరీ మాస్ గా ఉండటం డ్రా బ్యాక్ అంటూ……
ప్రీమియర్ షో చూసిన వాళ్ళు చెబుతున్నా… ఓవరాల్ గా సినిమా పరంగా మాత్రం అంచనాలను అందుకునే రేంజ్ లోనే ఉందని చెబుతున్నారు. మాస్ కి సినిమా నచ్చే అవకాశం ఎక్కువగా ఉందని, క్లాస్ ఆడియన్స్ ఎంతవరకు ఓన్ చేసుకుంటారో అన్న దానిపై సినిమా ఏ రేంజ్ కి వెళుతుంది అన్నది చెప్పగలం అంటున్నారు. ఓవరాల్ గా అల్లు అర్జున్ వన్ మాన్ షో అయినా…
దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడని… హీరోయిన్ రష్మిక పర్వాలేదు అనిపించగా సమంత ఐటెం సాంగ్ అదిరిపోయిందని అంటున్నారు. ఇతర స్టార్ కాస్ట్ కూడా మెప్పించగా ఫైనల్ గా సినిమా మరీ మాస్ కంటెంట్ తో ఉండటంతో ఎబో యావరేజ్ రేంజ్ లో అనిపించిందని చెబుతున్నారు ఓవర్సీస్ ఆడియన్స్…
మాస్ బొమ్మలకు ఓవర్సీస్ లో టాక్ ఇదే విధంగా ఉండటం అన్నది కామన్ అనే చెప్పాలి. అందునా పుష్ప మరీ మాస్ ఓవర్ లోడెడ్ లా ఉన్న నేపధ్యంలో ఈ రేంజ్ టాక్ ఇక్కడ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సరిపోతుంది అని చెప్పాలి. ఇక రెగ్యులర్ షోలకు ఈ టాక్ రేంజ్ లో మౌత్ టాక్ వచ్చినా ఇక పుష్పరాజ్ జాతర మరో లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.