Home న్యూస్ పుష్ప2 సెకండ్ సాంగ్ రివ్యూ…కుమ్మిందిగా సాంగ్!

పుష్ప2 సెకండ్ సాంగ్ రివ్యూ…కుమ్మిందిగా సాంగ్!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie) సినిమా నుండి ఆల్ రెడీ ఫస్ట్ సాంగ్ పుష్ప పుష్ప రిలీజ్ అయ్యి సాలిడ్ గా రీచ్ ను సొంతం చేసుకుంటూ ఉండగా రీసెంట్ గా సినిమా నుండి రెండో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు…

సూసేకి(#SOOSEKI(The Couple Song)#Pushpa2) అనే లిరిక్ తో తెరకెక్కిన ఈ సాంగ్ సినిమాలో డ్యూయెట్ గా రాబోతుండగా దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యాజిక్ ను చూపించాడు…ఆల్ మోస్ట్ మొదటి పార్ట్ లో వచ్చిన నా సామి సాంగ్ ట్యూన్ నుండే మెయిన్ థీమ్ ను తీసుకుని మరోసారి ఆకట్టుకునే మ్యూజిక్ తో ఈ సాంగ్ ను రూపొందించాడు…

అయినా కూడా ఫస్ట్ టైం విన్నప్పుడే ఇన్ స్టంట్ గా ఇంప్రెస్ చేసింది అని చెప్పాలి ఈ సాంగ్…సినిమాలో షాట్స్ ఏమి చూపించకుండా కేవలం మేకింగ్ టైంలో తీసిన ఫుటేజ్ తో సాంగ్ ను రిలీజ్ చేశారు…మేకింగ్ షాట్స్ అన్నీ బాగుండగా సాంగ్ కూడా క్యాచీగా ఉండటంతో ఇనీషియల్ రికార్డుల విషయంలో ఎలా ఉన్నా కూడా…

సాంగ్ కి లాంగ్ రన్ లో సాలిడ్ గా వ్యూవర్ షిప్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….ఓవరాల్ గా సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన 2 సాంగ్స్ కూడా మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ నే ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నాయి అని చెప్పాలి. మిగిలిన ఆల్బం కూడా ఇదే రేంజ్ లో ఉంటే ఇక పుష్ప2 రేంజ్ మరో లెవల్ లో ఉండటం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here