Home న్యూస్ టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 3 సినిమాలతో హాట్రిక్ కొట్టిన రేర్ హీరోలు వీళ్ళే!

టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 3 సినిమాలతో హాట్రిక్ కొట్టిన రేర్ హీరోలు వీళ్ళే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క హిట్ ని అందుకోవడమే చాలా కష్టంగా మారుతూ ఉండగా కొత్త స్టార్స్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ సొంతం అవ్వడం చాలా కష్టం. అందునా హిట్స్ పడిన తర్వాత ఆ హిట్స్ జోరుని వరుస సినిమాలుగా మార్చడం చాలా కష్టం.. రీసెంట్ గా నవీన్ పొలిశెట్టి నటించిన లేటెస్ట్ మూవీ…

మిస్ శెట్టి మిస్టర్ శెట్టి హిట్ తో కెరీర్ లో హాట్రిక్ ను సొంతం చేసుకోగా హీరోగా కెరీర్ ని మొదలు పెట్టి మొదటి 3 సినిమాలతో హిట్స్ కొట్టిన అతి కొద్ది మంది రీసెంట్ టైం హీరోల్లో ఒకరిగా నిలిచాడు నవీన్ పొలిశెట్టి… అందరి కన్నా ముందు ఒకప్పుడు…

ఉదయ కిరణ్(Uday Kiran) నటించిన చిత్రం, నువ్వు నేను మరియు మనసంతా నువ్వే సినిమాలతో హాట్రిక్ హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత అల్లు అర్జున్(Allu Arjun) బాక్స్ ఆఫీస్ దగ్గర గంగోత్రి, ఆర్య మరియు బన్నీ సినిమాలతో హాట్రిక్ హిట్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా…

ఆ తర్వాత చాలా టైంకి రాజ్ తరుణ్ నటించిన ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావా మరియు కుమారి 21F సినిమాలతో హాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు నవీన్ పొలిశెట్టి నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ…

జాతిరత్నాలు మరియు ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలతో మొదటి 3 సినిమాలు హిట్స్ కొట్టి హాట్రిక్ ను పూర్తి చేసుకున్నాడు….మిగిలిన హీరోలు నాలుగో సినిమాతో హిట్ అందుకోలేదు. అల్లుఅర్జున్ హ్యాప్పీ మూవీ పర్వాలేదు అనిపించింది… ఇప్పుడు నవీన్ పొలిశెట్టి తన…

అప్ కమింగ్ మూవీ తో మరో హిట్ కనుక కొడితే టాలీవుడ్ లో మొదటి 4 సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ కొట్టిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. మరి నవీన్ పొలిశెట్టి తన అప్ కమింగ్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

Miss Shetty Mr Polishetty Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here