బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని పూర్తి చేసుకునే పనిలో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, అన్ని చోట్లా సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతుంది…తెలుగు రాష్ట్రాల్లో, హిందీలో, తమిళ్ అండ్ కర్నాటకలో రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా…
ఊరమాస్ మూవీస్ ని పెద్దగా చూడని ఓవర్సీస్ ఆడియన్స్ కూడా పుష్ప2 ను ఎగబడి చూస్తూ ఉండగా అక్కడ 20 మిలియన్ డాలర్స్ ను దాటేసి సంచలనం సృష్టించింది…ఇక సినిమా ప్రపంచం అంతా మాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉన్నప్పటికీ ఒక్క చోట మాత్రం సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం జోరు చూపించడం లేదు ఇప్పుడు…ఆ ఏరియానే అల్లు అర్జున్ కి మాస్ ఫాలోయింగ్ ఉండే కేరళ ఏరియా. మొదటి నుండి అల్లు అర్జున్ మూవీస్ కి ఇక్కడ సాలిడ్ గా క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ ఫ్లాఫ్ మూవీస్ సైతం ఇక్కడ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాయి.
కానీ ఎందుకో ఇక్కడ మోస్ట్ హైప్ తో వచ్చిన పుష్ప2 మూవీ మాత్రం మినిమమ్ ఇంపాక్ట్ ను చూపించ లేక పోతుంది. మిగిలిన ఏరియాలు ఓ రేంజ్ లో కుమ్మేస్తున్న వేల కేరళలో ఓవరాల్ గా 6 రోజుల్లో 6.40 కోట్ల రేంజ్ లోనే షేర్ ని అందుకున్న సినిమా బిజినెస్ కి ఏమాత్రం న్యాయం చేయడం లేదు…
ఇక్కడ సినిమా వాల్యూ బిజినెస్ 20 కోట్ల రేంజ్ లో ఉండగా ఆ బిజినెస్ ను అందుకోవాలి అన్నా కూడా ఇంకా చాలా దూరం హోల్డ్ చేయాల్సి ఉంది కానీ వర్కింగ్ డేస్ లో మినిమమ్ హోల్డ్ ని కూడా చూపించ లేక పోతూ ఉండటంతో కేరళలో సినిమా తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను …
సొంతం చేసుకోవడం ఇక ఖాయంగా కనిపిస్తుంది…సెకెండ్ వీకెండ్ లో సినిమా కనుక తేరుకోలేక పోతే ఇక కేరళలో భారీ నష్టాలను సినిమా సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి. వరల్డ్ వైడ్ గా ఓ రేంజ్ లో కుమ్మేస్తున్న పుష్ప2 సినిమాకి ఇక్కడ ఇలాంటి రిజల్ట్ సొంతం అవ్వడం మాత్రం ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు…