బాక్స్ ఆఫీస్ దగ్గర డిసెంబర్ 5న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ నడుమ రిలీజ్ కి సిద్ధం అవుతున్న సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ పుష్ప 2 ది రూల్(Pushpa 2 The Rule Movie) మీద హైప్ మరో లెవల్ లో ఉంది. సినిమా మీద…
హిందీలో హైప్ ఇంకా ఎక్కువగానే ఉండగా ఎప్పుడెప్పుడు వస్తుందా అని సింగిల్ స్క్రీన్స్ తో బిగ్ థియేటర్స్ చెయిన్స్ అన్నీ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉండగా, ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ఇప్పుడు పుష్ప2 సినిమాను వాడుకోబోతున్నారు…
బాలీవుడ్ లో ప్రస్తుతం 2 సినిమాల మధ్య తీవ్ర పోటి దీపావళికి నెలకొనబోతుంది…. సింగం అగైన్(Singham Again) మరియు భూల్ భులయ్య3(Bhool Bhulaiyaa 3) సినిమాలు రెండూ కూడా దీపావళి టైంలో భారీగా పోటి పడబోతూ ఉండగా భూల్ భులయ్య2 సినిమాను…
హిందీలో డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది…పుష్ప2 మూవీ హిందీలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ఏఏ ఫిలిమ్స్ అనిల్ తదాని భూల్ భులయ్య2 సినిమాకి చాలా తక్కువ థియేటర్స్ ఇప్పుడు సింగం అగైన్ తో పోటి వలన దక్కుతూ ఉండగా సగం థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేయాలనీ ట్రై చేస్తున్నా…
కూడా ఎక్కువ శాతం థియేటర్స్ వాళ్ళు సింగం అగైన్ కి 60% థియేటర్స్ ఇస్తాం…భూల్ భులయ్య2 కి 40% తిఎతర్స్ ఇస్తాం అని చెబుతూ ఉండటంతో ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ ని పెంచడానికి పుష్ప2 హిందీ డిస్ట్రిబ్యూటర్ మాస్టర్ ప్లాన్ చేశాడు ఇప్పుడు…
భూల్ భులయ్య2 కి థియేటర్స్ ఇస్తే మాస్ థియేటర్స్ లో పుష్ప2 అల్లు అర్జున్ 30 ఫీట్ భారీ కటౌట్ ని మేమే థియేటర్ ముందు పెట్టిస్తాం అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. దాంతో థియేటర్ ఓనర్లు ఈ ఆఫర్ బాగా నచ్చడంతో థియేటర్స్ ని ఇంకా పెంచే పనిలో ఉన్నారని అంటున్నారు. హిందీ సినిమాల మధ్య పోటిలో ఇప్పుడు పుష్ప2 క్రేజ్ హెల్ప్ తో ఒక సినిమాకి ప్లస్ కాబోతుంది. మరి ఇది ఎంతవరకు సినిమాకి కలిసి వస్తుందో చూడాలి.