ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ లో భారీ హైప్ నడుమ రిలీజ్ కి సిద్ధం అవుతున్న మమ్మోత్ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా, మొదటి పార్ట్ సాధించిన సాలిడ్ విజయంతో రెండో పార్ట్ మీద అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి పోగా ఇప్పుడు సినిమా…
వరల్డ్ వైడ్ గా రికార్డ్ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉంది. రీసెంట్ గా సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకోగా అక్కడ నుండి ఫస్ట్ టాక్ కూడా బయటికి వచ్చేసింది…మొత్తం మీద యు/ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న పుష్ప2 మూవీ రన్ టైం పరంగా 3 గంటల 20 నిమిషాల రన్ టైంతో…
ఆడియన్స్ ముందుకు రాబోతుంది. టాలీవుడ్ లో రీసెంట్ టైంలో ఇంత లెంత్ తో వస్తున్న బిగ్గెస్ట్ మూవీ పుష్ప2 నే అని చెప్పాలి. ఇక సినిమా కి సెన్సార్ వాళ్ళ నుండి వినిపిస్తున్న ఫస్ట్ టాక్ చాలా వరకు పాజిటివ్ గా ఉందని చెప్పాలి…సినిమా కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయలేదు కానీ…
మొదటి పార్ట్ ఎండ్ నుండి స్టార్ట్ అయ్యే రెండో పార్ట్ లో అంచలంచలుగా హీరో ఎదిగే క్రమంలో రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది…ఈగో క్లాష్ తో పుష్పలో పగ పెరుగుతుంది…ఇక పుష్ప మీద పగతో ఉన్న ఫహాద్ ఫాజిల్…
సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న టైంలో ఏం జరిగింది…ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ఇది థీమ్ కథ అయితే చాలా ఉపకథలు, ఊహకందని ఫైట్ సీన్స్, ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ తో పాటు అల్టిమేట్ హీరోయిజం ఎలివేట్ సీన్స్ తో పుష్ప2 మూవీ…
పైసా వసూల్ అనిపించే సీక్వెల్ అని చెబుతున్నారు…మొదటి పార్ట్ కి ఏమాత్రం తీసిపోని విధంగా సెకెండ్ పార్ట్ లో ఎలివేషన్ లో హీరో క్యారెక్టర్ ఉంటుందని, అన్నింటికీ మించి మాస్ ఆడియన్స్ కోరుకునే ఫైట్ సీన్స్ సినిమాలో ఎక్స్ లెంట్ గా వచ్చాయి అని అంటున్నారు…
లెంత్ విషయం ఒక్కటి కామన్ ఆడియన్స్ కి ఇబ్బంది పెట్టకుండా ఉంటే కనుక పుష్ప2 మూవీ అంచనాలను చాలా వరకు అందుకుని ఆడియన్స్ ను మెప్పించే అవకాశం ఉందని అంటున్నారు. ఓవరాల్ గా సెన్సార్ వాళ్ళ నుండి సినిమా హిట్ టు సూపర్ హిట్ రేంజ్ కి తగ్గని టాక్ అయితే వినిపిస్తుంది..
ఇక ఇదే రేంజ్ లో టాక్ ఆడియన్స్ నుండి రిలీజ్ అయిన తర్వాత సొంతం చేసుకుంటే ప్రజెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో పుష్ప2 కి పోటి ఇచ్చే సినిమానే లేదు కాబట్టి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపించే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి ఇప్పుడు.
Media lo thappa, common public lo hype anthaga yemi ledu.