ఆల్ టైం రికార్డుల బెండు తీసి ఎపిక్ సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule) బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ రికార్డులతో మాస్ రచ్చ చేయగా 50 రోజులకు పైగా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ షేర్స్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది. సంక్రాంతి సినిమాలు వచ్చినా కూడా…
ఎక్స్ ట్రా సీన్స్ ని యాడ్ చేయడంతో ఎగబడి మరీ జనాలు సినిమాను థియేటర్స్ లో చూశారు…దాంతో అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని ఊచకోత కోసిన పుష్ప2 మూవీ కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అయిన తర్వాత ఇప్పుడు డిజిటల్ లో…
రిలీజ్ ను సొంతం చేసుకుంది…ఊహకందని రేంజ్ లో భారీ రేటు ఇచ్చి నెట్ ఫ్లిక్స్ లో సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకోగా డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత సినిమాకి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అయ్యింది అన్నది ఆసక్తిగా మారగా…
ఓటిటి రెస్పాన్స్ మాత్రం యునానిమస్ రెస్పాన్స్ అనిపించే రేంజ్ లో ఉందని చెప్పాలి. సినిమా లో స్టోరీ పాయింట్ కన్నా కూడా ఎమోషన్స్, హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిజం ఎలివేట్ సీన్స్, గంగమ్మ తల్లి జాతర సీన్ కానీ క్లైమాక్స్ ఎపిసోడ్ కానీ అన్నీ కూడా పార్టు పార్టులుగా…
ఎక్స్ లెంట్ టేకింగ్ తో మెప్పించాయి అని అంటున్నారు….లెంత్ ఎక్కువ అయినా కూడా ఎక్కడా బోర్ కూడా కొట్టకుండా ఒక ఫ్లో లో అలా వెళుతూ ఉంటుందని, అలాగే స్పెషల్ గా యాడ్ చేసిన సీన్స్ అన్నీ కూడా మంచి డీటైల్స్ తో ఆకట్టుకున్నాయని అంటూ ఉండటం విశేషం.
ఓవరాల్ గా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ తో సినిమా ఎక్స్ లెంట్ గా ఉందని చెబుతూ….రిపీట్ లో కూడా సినిమా బాగా మెప్పించింది అని అంటున్నారు. మొత్తం మీద డిజిటల్ లో కూడా పుష్ప2 మూవీ ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ టాక్ ను సొంతం చేసుకుంటూ ఉండటంతో డిజిటల్ లో కూడా సాలిడ్ రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని చెప్పాలి.