Home న్యూస్ 105* గంటలుగా టాప్ ట్రెండ్….సోషల్ మీడియా ఊపేస్తున్న అల్లు అర్జున్!

105* గంటలుగా టాప్ ట్రెండ్….సోషల్ మీడియా ఊపేస్తున్న అల్లు అర్జున్!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సుకుమార్ ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు ఆగస్టు లో గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న సెన్సేషనల్ సినిమా పుష్ప 2 ది రూల్(Pushpa 2 The Rule Movie) పై హైప్ అయితే మరో లెవల్ లో ఉంది.. సినిమా ఎప్పుడు వచ్చినా టాక్ ఏమాత్రం పాజిటివ్ గా ఉన్నా కూడా…

పాన్ ఇండియా రేంజ్ లో రికార్డుల ఊచకోత కోయడం ఖాయం, ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా అల్లు అర్జున్ గట్సీ లుక్ కి అందరూ ఫుల్ ఫిదా అయ్యారు, కానీ టీసర్ అని చెప్పి ఒక్క సీన్ షాట్ తోనే సరిపెట్టడంతో ఓవరాల్ గా టీసర్ మీద ఉన్న హైప్ ను…

టీసర్ మ్యాచ్ చేయలేదు. అయినా కూడా అల్లు అర్జున్ లుక్ మాత్రం సినిమా మీద బజ్ ను ఓ రేంజ్ లో పెంచేసింది. టీసర్ కి రెస్పాన్స్ మిక్సుడ్ గా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఈ టీసర్ సాలిడ్ గానే వైరల్ అవ్వగా యూట్యూబ్ లో టీసర్ రిలీజ్ అయిన రోజు ఈవినింగ్ నుండే ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టగా ఆల్ మోస్ట్ 4 రోజులకు పైగా టైం అయినా కూడా…

టీసర్ ఇప్పటికీ టాప్ లో అలానే ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం, సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సాలిడ్ క్రేజ్ ఉంది… ఇప్పుడు అది నిజం చేస్తూ రీసెంట్ టైంలో ఈ రేంజ్ లో యూట్యూబ్ లో ఎక్కువ టైం ట్రెండ్ అయిన టీసర్ గా పుష్ప2 టీసర్ దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం…

ఇక ట్రైలర్ అండ్ సాంగ్స్ కూడా ఎప్పుడు రిలీజ్ అయినా పార్ట్ 1 రేంజ్ లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటే ఇక సినిమా ఆగస్టు లో పాన్ ఇండియా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి రికార్డుల దుమ్ము దులిపేయడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here