Home న్యూస్ హనుమాన్ 1.2…టిల్లు స్క్వేర్ 1.24….మాస్…ఊరమాస్ ఇది!

హనుమాన్ 1.2…టిల్లు స్క్వేర్ 1.24….మాస్…ఊరమాస్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అయిన హనుమాన్(HanuMan Movie) ఇండియా మొత్తం మీద బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ లో సక్సెస్ అయిన ఈ సినిమా కలెక్షన్స్ ని బ్రేక్ చేయడం అన్ని సినిమాల ముందు ఉన్న బిగ్గెస్ట్ టార్గెట్….మొదటి రోజు కలెక్షన్స్ పరంగా లేటెస్ట్ గా వచ్చిన…

టిల్లు స్క్వేర్(Tillu Square Movie) సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకున్న హనుమాన్ తర్వాత రిమార్కబుల్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసింది. ప్రతీ రోజూ లాంగ్ రన్ లో కొత్త రికార్డులను సైతం నమోదు చేసింది. కాగా ఇప్పుడు హనుమాన్ మూవీ 14వ రోజు సాధించిన తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఈ ఇయర్ కి గాను….

రికార్డ్ లెవల్ లో ఉండగా ఇప్పుడు టిల్లు స్క్వేర్ మూవీ 14వ రోజు రంజాన్ పండగ అడ్వాంటేజ్ ను వాడుకుని హనుమాన్ మూవీ కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది…హనుమాన్ మూవీ 14వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. అదే టైంలో టిల్లు స్క్వేర్ మూవీ కి..

HanuMan Movie Total World Wide Collections!

పండగ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ పోటిలో ఆల్ మోస్ట్ అరడజను కొత్త సినిమాలు ఉండగా వాటిని తట్టుకుని 1.24 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం విశేషం. దాంతో మమ్మోత్ హనుమాన్ 14వ రోజు కలెక్షన్స్ కన్నా టిల్లు స్క్వేర్ 14వ రోజు కలెక్షన్స్ ఎక్కువగా సొంతం చేసుకోగా ఈ ఇయర్ బిగ్గెస్ట్ డే 14 కలెక్షన్స్ ని నమోదు చేసిన…

టిల్లు స్క్వేర్ ఓవరాల్ గా లాభాల పరంగా కూడా హనుమాన్ తర్వాత ఈ ఇయర్ భారీ లాభాలను అందుకున్న రెండో సినిమాగా కొనసాగుతుంది. ఇక ఈ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి వచ్చే సినిమాల్లో ఈ సినిమాలు 14వ రోజున నమోదు చేసిన కలెక్షన్స్ ని టార్గెట్ చేసే రేంజ్ లో ఏ సినిమాలు రచ్చ లేపుతాయో చూడాలి.

Tillu Square 2 Weeks(14 Days) Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here