Home న్యూస్ 1st డే….100 కోట్ల కలెక్షన్స్ సినిమా…కానీ 2.0 ఏంటి సామి…దారుణం ఇదీ!

1st డే….100 కోట్ల కలెక్షన్స్ సినిమా…కానీ 2.0 ఏంటి సామి…దారుణం ఇదీ!

0

ఒకప్పుడు భజరంగీ భాయిజాన్, సుల్తాన్, ఏక్తా టైగర్ లాంటి అద్బుతమైన సినిమాలు తీసిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రీసెంట్ టైం లో అన్నీ నాసిరకం సినిమాలే చేస్తూ వస్తున్నాడు. దబాంగ్ 3 మొదటి 2 పార్టుల మాదిరిగానే ఉండగా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు, అంతకన్నా ముందు వచ్చిన రేస్ 3 సినిమా అయితే ఆడియన్స్ ని థియేటర్స్ కి ఏమాత్రం రప్పించలేక భారీ డిసాస్టర్ గా నిలిచింది. ఇక ఇలాంటి టైం లో సల్మాన్ ఖాన్ చేసిన…

లేటెస్ట్ మూవీ రాధే పోకిరి హిందీ రీమేక్ వాంటెడ్ కి సీక్వెల్ అంటూ రాగా రీసెంట్ గా డిజిటల్ లో పే పెర్ వ్యూ పద్దతి లో రిలీజ్ అయిన ఈ సినిమా కి ఆడియన్స్ నుండి కంప్లీట్ నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది, సినిమా ఏమాత్రం ఇంప్రెస్ చేయలేక పోయింది అని చెప్పొచ్చు.

అయితేనేం తొలిరోజు డిజిటల్ లో పే పెర్ వ్యూ పద్దతిలో ఏకంగా 4.2 మిలియన్స్ వరకు వ్యూస్ ని సొంతం చేసుకుని ఏకంగా 104 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని దక్కించుకుని సంచలనం సృష్టించింది. అలాంటి ఈ సినిమా కి యూసర్ రేటింగ్స్ మాత్రం దారుణంగా ఉన్నాయని చెప్పొచ్చు.

ప్రతీ సినిమా కి యూసర్ రేటింగ్స్ ఇచ్చే IMDB లో ఈ సినిమా సల్మాన్ కెరీర్ లోనే టాప్ 2 లోవేస్ట్ రేటింగ్ దక్కింది, మొదటి ప్లేస్ లో సల్మాన్ నటించిన రేస్ 3 సినిమా 1.9 యూసర్ రేటింగ్ ను సొంతం చేసుకోగా, ఇప్పుడు రెండో ప్లేస్ లో కేవలం 2.0 రేటింగ్ ను సొంతం చేసుకుని రాధే సినిమా భారీ దెబ్బ కొట్టింది అని చెప్పాలి.

ఎండ్ ఆఫ్ ది డే సినిమా హిట్ అండ్ ఫ్లాఫ్ కి కలెక్షన్స్ మాత్రమే కొలమానం కాబట్టి మొదటి రోజు సాధించిన భీభత్సమైన కలెక్షన్స్ సినిమా రేంజ్ ని తెలియజేయగా వీకెండ్ టోటల్ రిపోర్ట్స్ ఇదే రేంజ్ లో ఉంటే పే పెర్ వ్యూ పద్దతి లో త్వరలో మరిన్ని బిగ్ మూవీస్ రిలీజ్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here