బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రంజాన్ కానుకగా రిలీజ్ అవ్వాల్సింది కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాకుండా ఇండియా లో డిజిటల్ లో పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ ను సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో పరిస్థితులు చాలా చోట్ల నార్మల్ అవ్వడం తో థియేటర్స్ లోనే రిలీజ్ ను సొంతం చేసుకుంది…
ఇండియా లో పే పెర్ వ్యూ పద్దతి లో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో మట్టుకు చిల్లర కలెక్షన్స్ ని మాత్రమే సొంతం చేసుకుంటూ వస్తుంది, ముఖ్యంగా అమెరికా లో తిరిగి బాలీవుడ్ సినిమాలకు పూర్వ వైభవాన్ని ఈ సినిమా…
తీసుకు వస్తుంది అని అంతా అనుకోగా ఈ సినిమా మట్టుకు మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా క్రియేట్ చేయలేదు, అమెరికాలో మొత్తం మీద వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి 250K డాలర్స్ ని మాత్రమే సొంతం చేసుకుంది, అదే టైం లో మార్చ్ టైం లో కేసులు అప్పుడే తగ్గుతున్న…
తరుణం లో వచ్చిన తెలుగు సినిమా జాతిరత్నాలు మొత్తం మీద వీకెండ్ లోనే 700K డాలర్స్ ను కలెక్ట్ చేసి దుమ్ము లేపింది, ఈ రికార్డ్ ఓపెనింగ్స్ మన వకీల్ సాబ్ అందుకుంటుంది అనుకుంటే అందుకోలేదు, ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ మూవీ అయినా సత్తా చాటుతుంది అనుకుంటే సల్మాన్ రాధే సినిమా కూడా అక్కడ….
చిల్లర కలెక్షన్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది, సినిమా టాక్ కూడా గట్టి ఇంపాక్ట్ ని చూపి ఉండొచ్చు అని చెప్పాలి. ఏది ఏమైనా ఓవరాల్ గా కలెక్షన్స్ పరంగా ఈ ఇయర్ బిగ్ స్టార్ మూవీస్ ని కూడా డామినేట్ చేస్తూ చిన్న సినిమా జాతిరత్నాలు అమెరికాలో టాప్ ప్లేస్ లో అలానే కొనసాగుతూ వెళుతూ ఉండటం విశేషం అనే చెప్పాలి….