ఇప్పటి వరకు డిజిటల్ లో రిలీజ్ అయిన సినిమాల రేట్లు ఒకెత్తు పాన్ ఇండియా సెన్సేషనల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ కి దక్కిన డిజిటల్ రిలీజ్ రేటు మరో ఎత్తు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆల్ మోస్ట్ రెండేళ్ళుగా ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ సెకెండ్ వేవ్ ఎదురు దెబ్బ వలన…
మిగిలిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఎదురు దెబ్బ తగలగా సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఇయర్ ఎండ్ కి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉండగా ఈ సినిమాను కూడా డిజిటల్ లో రిలీజ్ చేయించడానికి లీడింగ్ OTT జైంట్స్ తెగ ట్రై చేశాయి కానీ…
ఆ రేట్లు ఏంటి అనేది మాత్రం పెద్దగా బయటికి రాలేదు. కానీ రీసెంట్ గా సల్మాన్ ఖాన్ రాధే సినిమా ను ఏకంగా 250 కోట్ల రేటు కి టోటల్ రైట్స్ ని కొని సినిమాను పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేశారు. ఇక ఇదే మాదిరిగా ఈ ఇయర్ మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో…
ముందు నిలిచే ప్రభాస్ రాధే శ్యామ్ కోసం కూడా భారీ రేటు ని ఆఫర్ చేశారట. ఆ రేటు ఇండియన్ సినిమా హిస్టరీలో డిజిటల్ రిలీజ్ ల విషయం లో ఎపిక్ రికార్డ్ రేటు అని తెలుస్తుంది. ఏకంగా 400 కోట్ల రేటు ఆఫర్ చేసి సినిమా టోటల్ హక్కులను గంపగుత్తుగా సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ చెప్పుకోచ్చారట జీ వాళ్ళు.
కానీ మేకర్స్ సినిమా ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లోనే వస్తుందని నో చెప్పగా సినిమాను వదులుకోవడం ఇష్టం లేక… సినిమా రిలీజ్ అయ్యాక అన్ని హిందీ కాకుండా మిగిలిన భాషల డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ని జీ నెట్ వర్క్ వాళ్ళు భారీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. ఆ రేటు వివరాలు అతి త్వరలో రిలీజ్ అవుతాయని సమాచారం.