టాలీవుడ్ లో 2021 ఇయర్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సెన్సేషన్ రాదే శ్యామ్ కూడా ఒకటి… రాధాకృష్ణ డైరెక్షన్ లో UV క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా ఎప్పటి నుండో నిర్మాణం అవుతూ ఉండగా సినిమా మోషన్ పోస్టర్ ని లాస్ట్ ఇయర్ లో రిలీజ్ చేయగా తర్వాత సినిమా గురించిన అప్ డేట్స్ ఏవి యూనిట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు.
ఇక సినిమా టీసర్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నాం అంటూ డైరెక్టర్ స్వయంగా చెప్పినా కానీ టీం టీసర్ ను రిలీజ్ చేయలేదు… ఇక ఫిబ్రవరి 14 న చేస్తారు అంటున్నారు కానీ క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాల రిలీజ్ డేట్లు…
అనౌన్స్ చేస్తున్నారు కానీ పాన్ ఇండియా మూవీ అయిన ఈ సినిమా రిలీజ్ డేట్ ను మాత్రం అనౌన్స్ చేయడం లేదు…. ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్ చిర్రెత్తుకొచ్చి సోషల్ మీడియా లో రాదే శ్యామ్ సినిమా ఇక డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ లోనే రాబోతుంది, ప్రభాస్ అప్ కమింగ్ మూవీ సాలార్ ఇక…
థియేటర్స్ లో రాబోతుంది అంటూ నెగటివ్ ట్రెండ్ చేసినా కూడా సినిమా టీం అసలు స్పందించలేదు సరికదా పట్టించుకొను లేదు… ఇంతలా రియాక్ట్ అవ్వకుండా ఉండటానికి కారణం సినిమా లో VFX వర్క్ ఇంకా చాలా పెండింగ్ లో ఉండటమే అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఆ వర్క్ కంప్లీట్ అయ్యే స్టేజ్ కి వచ్చాకే ఎదో ఒక అప్ డేట్ ఇవ్వగలరని, అందుకే టీం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదని అంటున్నారు.
ఈ లెక్కన సినిమా సమ్మర్ లో వచ్చే అవకాశం తక్కువే అని కూడా వార్తలు వస్తున్నాయి… జూన్ లేదా జులై టైం లో సినిమా బరిలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు. మరి అప్పటి వరకు ఫ్యాన్స్ ఆగక తప్పదు… ఇదైనా కన్ఫాం అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది… లేట్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపితే అదే చాలు అని ఆశిస్తున్నారు కొందరు.