బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా లాస్ట్ ఇయరే రిలీజ్ అవ్వాల్సింది కానీ ఫస్ట్ వేవ్ వలన పోస్ట్ పోన్ అయ్యి ఈ ఇయర్ రంజాన్ కి రిలీజ్ అవుతుందని కన్ఫాం చేయగా ఈ సారి సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది అనుకుంటే లేదని డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేసిన మేకర్స్ సినిమాను…
రంజాన్ కానుకగా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేశారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్ నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుని IMDB లో సైతం కేవలం 1.9 రేటింగ్ తో సరిపెట్టుకుని మైండ్ బ్లాంక్ చేసినప్పటికీ కూడా సల్మాన్ క్రేజ్ దృశ్యా ఫస్ట్ డే ఇండియన్ రికార్డులను…
బ్రేక్ చేసి సంచలనాలను సృష్టిస్తూ ఏకంగా 104.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది, ఇక సినిమా మొదటి రోజు మొత్తం మీద 4.2 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుందని తెలియజేయగా ఇప్పుడు మొత్తం మీద మొదటి వీకెండ్ కి గాను…
సినిమా సాధించిన వ్యూస్ లెక్కలను ట్రేడ్ కి రిలీజ్ చేశారు, ఆ లెక్కల ప్రకారం సినిమా ఓవరాల్ గా వీకెండ్ పూర్తీ అయ్యాక 7.6 మిలియన్స్ వరకు వ్యూస్ ని సొంతం చేసుకుందని అంటున్నారు, అంటే ఆల్ మోస్ట్ 76 లక్షల మంది పే పెర్ వ్యూ పద్దతి లో 249 టికెట్ రేటు తో సినిమా ని చూశారు అని అంటున్నారు, ఆ లెక్కన సినిమా మొత్తం మీద…
189 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని పే పెర్ వ్యూ పద్దతిలో కేవలం 249 టికెట్ రేటు లెక్కలోకి తీసుకుంటే సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు, ఇంకా అందులో కొందరు 499 రేటు పెట్టి ఒక ఏడాది సబ్ స్క్రిప్షన్ ని కూడా తీసుకుని చూశారు, ఆ లెక్కలు తెలియలేదు కానీ అవి కూడా కౌంట్ చేసుకుంటే 200 కోట్ల ఓవరాల్ కలెక్షన్స్ ని వీకెండ్ లో ఈ సినిమా సొంతం చేసుకుందని చెప్పొచ్చు.