బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి సినిమాలు అందరికీ చాలా కీలకమే, అందునా బయటి నుండి వచ్చిన కొత్త యాక్టర్స్ కి మొదటి సినిమాలు హిట్ అయితేనే టాలీవుడ్ లో అవకాశాలు ఉంటాయి, ఈ విషయం లో యంగ్ హీరో రాజ్ తరుణ్ మాత్రం టాలీవుడ్ లో అడుగు పెట్టిన కొత్తలో వరుస పెట్టి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్తా మావ, కుమారి 21 లాంటి సినిమాలు హిట్ అయ్యి…
బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ కంప్లీట్ అవ్వగా తర్వాత మంచు విష్ణు తో చేసిన మల్టీ స్టారర్ ఈడో రకం ఆడో రకం సూపర్ హిట్ అవ్వగా తర్వాత నుండి ఒక్క సారి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ మూవీ ని అందుకోలేక పోయాడు రాజ్ తరుణ్.
ఎన్ని ప్రయోగాలు చేసినా క్లీన్ హిట్ దక్కలేదు, ఇక తన లేటెస్ట్ మూవీ ఒరేయ్ బుజ్జిగా అయినా కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకుంటే అది అక్టోబర్ 2 న డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కానుండగా ఇప్పుడు కెరీర్ లో మొదటి హిట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ తోనే…
తన కొత్త సినిమా కమిట్ అయ్యాడట రాజ్ తరుణ్, నాగార్జున ఈ సినిమా ను నిర్మించడానికి ముందుకు రాగా, ఈ లాక్ డౌన్ టైం లో మొత్తం మీద 7 కొత్త సినిమాలు కమిట్ అయిన రాజ్ తరుణ్ అందులో ముందుగా ఈ సినిమా ను మొదలు పెట్టబోతున్నాడని సమాచారం. నాగార్జున బ్యానర్ లో ఇది వరకు ఉయ్యాలా జంపాల హిట్ అవ్వగా తర్వాత చేసిన…
రంగుల రాట్నం సినిమా యావరేజ్ గా నిలిచింది, ఇప్పుడు తిరిగి నాగార్జున బ్యానర్ లో శ్రీనివాస్ గవిరెడ్డితో ఓ సినిమా చేస్తున్న రాజ్ తరుణ్ ఈ సారి సాలిడ్ గా కంబ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరగబోతున్న ఈ సినిమా వచ్చే ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం…