Home గాసిప్స్ 4 ఏళ్ళుగా హిట్ లేదు…ముందు ఆఫర్ బాగున్నా…ఇప్పుడు దెబ్బ పడింది సామి!!

4 ఏళ్ళుగా హిట్ లేదు…ముందు ఆఫర్ బాగున్నా…ఇప్పుడు దెబ్బ పడింది సామి!!

0

పరిస్థితులకు తగ్గట్లు మెదలాలి అంటారు అందుకే… టాలీవుడ్ లో చాలా సినిమాలు డిజిటల్ రిలీజ్ కి సిద్ధం కాకుండా ఎదురు చూస్తాం, కేవలం థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని డిసైడ్ అవ్వగా మరో పక్క బాలీవుడ్ లో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా పరిస్థితిని ముందే గమనించి మంచి ఆఫర్ అనిపిస్తే చాలు ఆ సినిమా ని డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధం చేస్తూ నష్టాలు రాకుండా జాగ్రత్తపడ్డారు.

అదే టైం లో టాలీవుడ్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ వైపు చాలా చిన్న సినిమాలు మాత్రమే ముందుకు రాగా OTT యాప్స్ ఒక్క పెద్ద సినిమా రిలీజ్ చేస్తే తర్వాత మిగిలిన సినిమాలు ఆటోమేటిక్ గా క్యూ కడతాయి అని ముందు సమ్మర్ రేసులో ఉన్న సినిమాలకు సాలిడ్ రేటు ఆఫర్ చేశాయి.

కానీ అప్పుడు నో చెప్పిన సినిమాల్లో ఇప్పుడు నాని వి మూవీ మంచి రేటుకి రిలీజ్ కన్ఫాం చేయడం తో చాలా సినిమాలు మళ్ళీ OTT యాప్స్ ని అప్రోచ్ అవుతుండగా ఇప్పుడు వీళ్ళు చెప్పిందే రేటుగా మారింది. ఈ ఎఫెక్ట్ ఒక్కో సినిమా పై ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది.

లేటెస్ట్ గా 4 ఏళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ గుండెజారి గల్లంతైందే డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ డైరెక్షన్ లో చేసిన ఒరేయ్ బుజ్జిగా సమ్మర్ లో ముందు రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కరోనా వల్ల ఆగిపోగా సినిమా కి మొదటి నుండి డీసెంట్ OTT ఆఫర్లు రాగా అందులో 7.5 కోట్ల సాలిడ్ రేటు కూడా ఉంది.

రాజ్ తరుణ్ ప్రజెంట్ మార్కెట్ రేంజ్ లో ఇది మంచి డీల్ అయినా టీం ఏమి చెప్పకపోవడం ఇప్పుడు పరిస్థితులు మారిపోవడం తో టీం మళ్ళీ ఆ రేటు పై చర్చిద్దాం అంటూ OTT ని అప్రోచ్ అయినా ఇప్పుడు ఆ రేటు ఇవ్వలేమని చెప్పారట. దాంతో టీం ఇప్పుడు మళ్ళీ మంచి ఆఫర్ ఎవరు ఇస్తారా అని ఎదురు చూస్తుందని టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here