యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ లో డౌన్ ఫాల్ పీక్ స్టేజ్ లో ఉన్నాడు, లాస్ట్ ఇయర్ డిజిటల్ రిలీజ్ అయిన ఒరేయ్ బుజ్జిగా సినిమా డిజిటల్ లో మంచి రిజల్ట్ ను సొంతం చేసుకుంది కానీ ఆ ఇంపాక్ట్ రాజ్ తరుణ్ న్యూ మూవీ పై ఇసుమంత కూడా కనిపించడం లేదు సరికదా అసలు రాజ్ తరుణ్ కొత్త సినిమా రిలీజ్ అవుతున్న విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసు ఇప్పుడు…
అది కూడా ఒరేయ్ బుజ్జిగా లాంటి డిజిటల్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా డైరెక్షన్ లోనే వెంటనే మొదలు అయిన డిఫెరెంట్ మూవీ పవర్ ప్లే బాక్స్ ఆఫీస్ దగ్గర 5 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అయింది. ఈ సినిమా అసలు రాజ్ తరుణ్ మూవీ అని…
ఇలా రిలీజ్ అవుతుంది అన్న విషయం కూడా పెద్దగా ఎవరికీ తెలియదు అంటే సినిమా ప్రమోషన్స్ ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. కానీ ఇది డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ కాబట్టి బయర్లు మాత్రం సినిమాను కొన్నారు. సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ ను గమనిస్తే…
నైజాం లో 60 లక్షలు, సీడెడ్ లో 20 లక్షలు టోటల్ ఆంధ్రాలో 1కోటి బిజినెస్ చేసింది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 1.8 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా, ఇక మిగిలిన చోట్ల అన్ని కలిపి మరో 10 లక్షల బిజినెస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా.. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు 1.9 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 2.1 కోట్ల రేంజ్ కి తగ్గని కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది, రాజ్ తరుణ్ ప్రస్తుత బాక్స్ ఆఫీస్ ఫాం దృశ్యా సినిమా పై బయట ఎలాంటి బజ్ లేకపోవడం లాంటివి ఈ బిజినెస్ ను రికవరీ చేస్తాయా లేదా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇక..