Home న్యూస్ చిన్న సినిమా…ట్రైలర్ సూపర్ హిట్…సాలిడ్ బిజినెస్…హిట్ కి ఎంత కావాలంటే?

చిన్న సినిమా…ట్రైలర్ సూపర్ హిట్…సాలిడ్ బిజినెస్…హిట్ కి ఎంత కావాలంటే?

0

టెలివిజన్ నుండి సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు అందరూ సక్సెస్ అవ్వరు కానీ కొందరు రీసెంట్ టైం లో బాగానే సక్సెస్ అయ్యారు, యాంకర్ ప్రదీప్, అంతకన్నా ముందు సుడిగాలి సుదీర్ సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఇద్దరి కన్నా ముందు ఒక్క సీరియల్ తో సూపర్ ఫేమస్ అయిన యాక్టర్ హీరోగా మారి చేస్తున్న సినిమా రాబోతుంది, ఆ సినిమానే షాది ముబారక్…

ఒకప్పుడు టెలివిజన్ ని ఒక ఊపు ఊపేసిన సీరియల్ మొగలిరేకులు.. ఆ సీరియల్ లో నటించిన సాగర్ అడపాదడపా కొన్ని రోల్స్ లో నటించినా ఆశించిన సక్సెస్ రాలేదు, కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు షాది ముబారక్ అంటూ కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుండగా…

ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది, ఇక సినిమా బిజినెస్ కూడా బాగానే జరిగింది అన్ని సెంటర్స్ లో… నైజాంలో ఈ సినిమా ఓవరాల్ వర్త్ బిజినెస్…

80 లక్షల దాకా ఉండగా సీడెడ్ లో 40 లక్షల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా. టోటల్ ఆంధ్రాలో 1.2 కోట్ల బిజినెస్ ను సాధించింది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో టోటల్ గా 2.4 కోట్ల బిజినెస్ ను సాధించిన ఈ సినిమా…. ఇక మిగిలిన చోట్ల మరో 15 లక్షల దాకా బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 2.55 కోట్ల బిజినెస్ ను సాధించింది.

దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమమ్ 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాలి. చిన్న సినిమానే అయినా ఈ బిజినెస్ అద్బుతంగా జరిగింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కలెక్షన్స్ పరంగా ఎంతవరకు ఈ కలెక్షన్స్ ని రికవరీ చేస్తుందో అన్నది ఆసక్తి కరంగా మారింది ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here