బ్రోచేవారెవరురా సినిమాతో మంచి హిట్ కొట్టినా తర్వాత తిప్పారా మీసం, గాలిసంపత్ లాంటి ఫ్లాఫ్ మూవీస్ తో డౌన్ అయిన శ్రీ విష్ణు కామెడీ ఎంటర్ టైనర్ రాజ రాజ చోర సినిమా తో ఆదియన్స్ ముందుకు వచ్చాడు. రిలీజ్ కి ముందు హీరో సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ తో చేసిన కామెంట్స్ తో సినిమా కి ప్రమోషన్స్ బాగానే దక్కాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకుందా లేదా తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే ఒక స్టేషనరీ షాప్ లో పని చేసే హీరో పెద్దగా చదువుకోక పోయినా తన లవర్ మేఘా ఆకాష్ ముందు సాఫ్ట్ వేర్ లా కటింగ్ ఇస్తాడు… కానీ అవసరాల కోసం దొంగతనాలు చేస్తాడు, ఇలా లైఫ్ సాగుతున్న టైం లో తన లైఫ్ ల…
సునైనా అనే మరో హీరోయిన్ ఉందని తెలుస్తుంది. తర్వాత ఏం జరిగింది… వీళ్ళందరినీ హీరో ఎలా మ్యానేజ్ చేశాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… పెర్ఫార్మెన్స్ పరంగా శ్రీ విష్ణు తన రోల్ మట్టుకు అదరగొట్టేశాడు… మంచి ఈజ్ తో కామెడీ సీన్స్ లో మెప్పించగా సెంటిమెంట్ సీన్స్ లో కూడా ఆకట్టుకున్నాడు.
ఇక హీరోయిన్స్ ఇద్దరూ కూడా తమ తమ రోల్స్ లో మెప్పించారు. ఇతర యాక్టర్స్ కూడా మెప్పించారు… సంగీతం పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. కొన్ని సీన్స్ కి మంచి జోష్ ఇచ్చింది. డైలాగ్స్ బాగున్నాయి కానీ కొన్ని చోట్ల ఆడియన్స్ అర్ధం చేసుకోలేని విధంగా అనిపించాయి. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు అదిరిపోయింది… సెకెండ్ ఆఫ్ మరింత బాగా ఎడిట్ చేసి ఉంటే బాగుండేది.
సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకోగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. ఇక డైరెక్షన్ పరంగా హశిత్ గోలి అనుకున్న పాయింట్ కి ఫస్టాఫ్ వరకు పాత్రల పరిచయం అండ్ ఆ పాత్రల ద్వారా మంచి కామెడీని రాబట్టి ఇంటర్వెల్ టైం లో పీక్ లో ఎంటర్ టైన్ చేసి మెప్పించి సెకెండ్ ఆఫ్ పై అంచనాలను పెంచగా…
ఆ అంచనాలను సెకెండ్ ఆఫ్ మరీ అందుకోలేక పోయినా కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది..ఫస్టాఫ్ లో మారిదిగానే ఎంటర్ టైన్ మెంట్ ని సెకెండ్ ఆఫ్ లో కూడా అదే రేంజ్ లో క్యారీ చేసి ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేది, కానీ అలా కాకుండా ఎమోషనల్ సీన్స్ ని, అలాగే ప్రతీ క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ ని ఇస్తూ సినిమా లెంత్ పెంచినట్లు అనిపించింది.
ఇక క్లైమాక్స్ ప్రవచనాలతో బాగానే ఎండ్ చేసి మొత్తం మీద ఆడియన్స్ సినిమా బాగానే ఉంది లే అనిపించేలా వచ్చేలా చేశాడు డైరెక్టర్… సినిమాలో శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్, ఫస్టాఫ్ కామెడీ, ఎక్స్ లెంట్ ఇంటర్వెల్ మేజర్ హైలెట్స్ కాగా సెకెండ్ ఆఫ్ కామెడీ అంతలా లేక పోవడం, సీన్స్ డ్రాగ్ అవ్వడం, కథని సాగదీసినట్లు అనిపించడం మేజర్ డ్రా బ్యాక్స్…
కానీ ఓవరాల్ గా సినిమా ఫస్టాఫ్ ఇచ్చిన ఎంటర్ టైన్ మెంట్ సెకెండ్ లో మిస్ అయినా కానీ ఎండ్ అయిన తీరు బాగుండటం తో మొత్తం మీద పర్వాలేదు ఒకసారి ఈజీగా చూడొచ్చు అనిపించే విధంగా సినిమా ముగుస్తుంది… ముందే చెప్పినట్లు సెకెండ్ ఆఫ్ ని కూడా కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ జోన్ లో చెప్పి ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేది… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్…