కెరీర్ ని మొదలు పెట్టి 5 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ నికార్సయిన హిట్ ని సొంతం చేసుకోలేని హీరో బెల్లంకొండ శ్రీనివాస్, రీసెంట్ గా సీత సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమా నిరాశ పరిచింది. ఇక ఇప్పుడు తమిళ్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన రాక్షసన్ సినిమాను తెలుగు లో రాక్షసుడు పేరుతొ రీమేక్ చేయగా ఈ సినిమా పై తెలుగు లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి అని చెప్పాలి.
ఇక సినిమా బిజినెస్ పరంగా వరుసగా ఫ్లాఫులను ఎదురుకున్నా కానీ బెల్లంకొండ కెరీర్ స్పీడ్ తగ్గలేదని నిరూపిస్తూ మంచి బిజినెస్ నే సాధించింది అని చెప్పాలి. ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ కూడా చేయలేని విధంగా 16 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా..
ఒకసారి మేజర్ ఏరియాల వారిగా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ని గమనిస్తే…
Nizam – 5.50Cr
Ceeded – 2.1Cr
Andhra – 6Cr
Ap TG – 13.6Cr
Ka-ROI – 1.8Cr
OS – 0.8Cr
Total – 16.2Cr ఇదీ మొత్తం మీద రాక్షసుడు సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్…
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్ ని కూడా పరిశీలిస్తే
Nizam – 200
Ceeded – 120
Andhra – 250
APTG – 570
Ka & ROI – 120
Os – 120
Total – 810 plus ఫైనల్ కౌంట్ 850 వరకు కూడా వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉందని సమాచారం. మొత్తం మీద బిజినెస్ పరంగా రిలీజ్ పరంగా కూడా సినిమా కుమ్మేయగా…
ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే అక్షరాలా 17.2 కోట్ల దాకా కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ బరిలో సాధించాల్సి ఉంటుంది, తమిళ్ లో వచ్చిన విధంగా టాక్ తెలుగు లో కూడా వస్తే కచ్చితంగా ఈ మార్క్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.