ఎనర్జిటిక్ స్టార్ రామ్ లాస్ట్ ఇయర్ ఇస్మర్ట్ శంకర్ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 40 కోట్ల మార్క్ మూవీ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఊరమాస్ హిట్ ని ఈ సినిమా తో సొంతం చేసుకున్నాడు, ఇప్పుడు తమిళ్ లో సూపర్ హిట్ అయిన తడం సినిమా ను తెలుగు లో రెడ్ పేరు తో రీమేక్ చేయగా సినిమా ఇప్పుడు…
వచ్చే ఇయర్ సంక్రాంతి కి రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమా షూటింగ్ ఈ ఇయర్ మార్చ్ లోనే షూటింగ్ కంప్లీట్ అయినా కానీ ఇప్పటి వరకు కొత్త సినిమా ను కమిట్ కాలేదు రామ్. మధ్యలో ఎన్నో కథలను విన్నా కానీ ఏ కథను కూడా ఫైనల్ చేయలేదు.
ఇప్పటి వరకు అనేక కథలను వినగా రీసెంట్ గా అనిల్ రావిపూడి, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో సినిమా కథలను విన్నా కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి టైం లో రామ్ కి అల్టిమేట్ ఆఫర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నుండి వచ్చింది అన్నది లేటెస్ట్ టాలీవుడ్ టాక్.
ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా కమిట్ అయిన త్రివిక్రమ్ ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ పోన్ వలన ఈ సినిమా మరింత డిలే అవ్వనుండగా మధ్యలో ఒక మీడియం రేంజ్ మూవీ ని తీయాలని త్రివిక్రమ్ ప్లాన్ లో ఉండగా దానికి ఎన్టీఆర్ కూడా ఓకె అన్నాడు, త్రివిక్రమ్ కొందరి తో సినిమాలు అనుకున్నా కానీ ఎందుకనో సెట్ కాలేదు.
ఫైనల్ గా ఇప్పుడు రామ్ దగ్గరకు వచ్చిన త్రివిక్రమ్ కథను వినిపించగా ఈ సారి రామ్ కూడా కథ పట్ల పాజిటివ్ గా స్పందించారని అంటున్నారు. దాంతో ఈ ప్రాజెక్ట్ కనుక రామ్ ఓకే అంటే కెరీర్ పరంగా బిగ్గెస్ట్ బూస్టప్ తో పాటు తన మార్కెట్ ని డబుల్ చేసే రేంజ్ లో హెల్ప్ అవ్వడం ఖాయమని చెప్పాలి. మరి రామ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి….