Home గాసిప్స్ సినిమా కలెక్షన్స్ పై రామ్ చరణ్ కామెంట్స్ కి హాట్సాఫ్ చెబుతున్న ఇండస్ట్రీ!!

సినిమా కలెక్షన్స్ పై రామ్ చరణ్ కామెంట్స్ కి హాట్సాఫ్ చెబుతున్న ఇండస్ట్రీ!!

1

 

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో సినిమా కలెక్షన్స్ పై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారాయి. తన సినిమా ఇంత కలెక్ట్ చేసింది అని పోస్టర్ లో చెప్పడం వలన అసలు సిసలు గొడవలు జరుగుతున్నాయని…అలా కాకుండా పోస్టర్స్ పై ఎలాంటి కలెక్షన్స్ డీటైల్స్ ఇవ్వకుండా ఉంటె తెలుగు సినిమా పరిశ్రమ మరింత ముందుకు వెళ్ళడం ఖాయమని చరణ్ చెప్పాడు.

కలెక్షన్స్ ని పోస్టర్స్ పై వేయడం ఎప్పటి నుండో వస్తున్నా ఆచారమే అయినా…అది ఇప్పుడు ఫ్యాన్ వార్స్ జరగడానికి ప్రధాన కారణంగా పరిగణిస్తున్నారు. ఒక సినిమా కలెక్షన్స్ ని చూసి మరో సినిమా ఆ కలెక్షన్స్ ని మించేలా కలెక్షన్స్ పోస్టర్స్ వేయడం గత కొన్నేళ్ళుగా సాగుతున్న విషయమే.

చరణ్ ఇంకా చెబుతూ కొన్ని సార్లు ఒరిజినల్ కలెక్షన్స్ వేసినా అవి నిజం కాదని చెడు ప్రచారం కూడా జరుగుతుందని రామ్ చరణ్ తెలియజేశాడు…..కాగా దీనికి ఇక పులిస్టాప్ పెట్టాలి అని ఫిక్స్ అయిన రామ్ చరణ్ ఇక మీద తనతో సినిమాలు చేసే నిర్మాతలకు సినిమా పోస్టర్స్ పై కలెక్షన్స్ ని వేయకూడదని చెప్పాడట…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here