Home న్యూస్ 13 ఏళ్ళు…2 ఇండస్ట్రీ హిట్లు….24 గంటల్లో ఫ్యాన్స్ కొత్త రికార్డ్!

13 ఏళ్ళు…2 ఇండస్ట్రీ హిట్లు….24 గంటల్లో ఫ్యాన్స్ కొత్త రికార్డ్!

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…. మెగాస్టార్ చిరంజీవి కొడుకు గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి నేటి తో 13 ఏళ్ళు పూర్తి అయ్యాయి. రామ్ చరణ్ నటించిన మొదటి సినిమా చిరుత బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 13 ఏళ్ళు పూర్తి అవ్వడం తో సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్ భారీ లెవల్ లో ట్రెండ్ చేయ గా కొత్త రికార్డులతో దుమ్ము దుమారం చేశారు 24 గంటల్లో.

మొదటి సినిమా చిరుత తోనే తానేంటో నిరూపించుకున్న మెగా పవర్ స్టార్, రెండో సినిమా మగధీర తో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీయడమే కాదు, ఇండియా లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిని నమోదు చేసి సంచలనం సృష్టించాడు.. తర్వాత ఆరెంజ్ తో నిరాశ పరిచినా…

రచ్చ, నాయక్, ఎవడు సినిమాలతో దుమ్ము లేపగా బాలీవుడ్ లో జంజీర్ రీమేక్ తో అడుగు పెట్టి నిరాశ పరిచినా టాలీవుడ్ లో కూడా గోవిందుడు అందరి వాడెలే, బ్రూస్ లీ సినిమాలు అంచనాలను అందుకోలేని టైం లో ధృవ తో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన మెగా పవర్ స్టార్…. తర్వాత రంగస్థలంతో లెక్కలన్నీ మార్చేశాడు.

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డులతో దూసుకు పోయిన ఈ సినిమా నాన్ బాహుబలి మూవీస్ లో కొత్త రికార్డ్ ను నమోదు చేయగా తర్వాత వినయ విదేయ రామ డిసాస్టర్ అయినా టెలివిజన్ లో మమ్మోత్ బ్లాక్ బస్టర్ గా నిలవగా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా లెవల్ లో ఎన్టీఆర్ తో కలిసి జక్కన్న డైరెక్షన్ లో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతున్న రామ్ చరణ్…

ఇండస్ట్రీ లో అడుగు పెట్టి 13 ఏళ్ళు పూర్తి అవుతున్న నేపధ్యంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో 24 గంటల్లో ఏకంగా 2.5 మిలియన్ ట్వీట్స్ తో యాక్టర్స్ యానివర్సరీ ట్రెండ్ లో కొత్త రికార్డ్ ను నమోదు చేసి పాత రికార్డ్ అల్లు అర్జున్ 17 ఏళ్ల ట్రెండ్ లో 1.7 మిలియన్ రికార్డ్ ను బ్రేక్ చేసి ఇప్పుడు కొత్త రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here