మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సోలోగా ఏ మూవీ ఇన్నాళ్ళు కమిట్ అవ్వకపోవడం తో ఎవరితో రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ చేస్తాడు అన్నది ఆసక్తిగా మారగా, చాలా వరకు తెలుగు డైరెక్టర్ ల పేర్లు మాత్రమే వినిపించాయి. దాంతో రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ…
తర్వాత చేయరా అన్న డౌట్లు వచ్చినా సరైన టైం కోసం చూసిన రామ్ చరణ్ రీసెంట్ గా టోటల్ టాలీవుడ్ తో పాటు ఇండియా మొత్తం షేక్ అయ్యే అప్ డేట్ తో ఫుల్ జోష్ పెంచాడు ఫ్యాన్స్ లో… అల్టిమేట్ కాంబినేషన్ తో తన అప్ కమింగ్ మూవీ ని ఆల్ ఇండియా లెవల్ లో…
టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా చెప్పుకునే శంకర్ డైరెక్షన్ లో తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు, ఈ కాంబినేషన్ ని అస్సలు ఎవరూ ఊహించి కూడా ఉండరనే చెప్పాలి. ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే… ప్రస్తుతం ఇండియా లో సింపుల్ గా టాప్ 3-4 డైరెక్టర్స్ లో సౌత్ నుండి…
రాజమౌళి టాప్ లో తర్వాత శంకర్ ప్రస్తుతం ఉన్నారు అని చెప్పొచ్చు… అలాంటి టాప్ 2 డైరెక్టర్స్ తో బాక్ టు బాక్ సినిమాలు చేసే అవకాశం సొంతం చేసుకున్న మొట్ట మొదటి హీరోగా రామ్ చరణ్ ఇప్పుడు రికార్డులకెక్కబోతున్నాడు. ఇప్పటి వరకు రాజమౌళి శంకర్ ల దర్శకత్వంలో నటించిన హీరో ఎవరూ లేరు, అలా చేయాలనీ ఇండియాలో కోరుకునే యాక్టర్స్ చాలామంది ఉన్నారు..
కానీ ఇప్పుడు ఆ రికార్డ్ ను రామ్ చరణ్ సొంతం చేసుకోబోతున్నాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత తన మార్కెట్ ఎక్స్ పాన్షన్ కి పక్కగా పెంచే సత్తా శంకర్ కి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం కొంచం స్లో అయినా తనదైన రోజున శంకర్ ఎలాంటి మూవీస్ తీస్తారో అందరికీ తెలిసిందే. తొలిసారి టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు కాబట్టి వీళ్ళ కాంబో ఆల్ ఇండియా లెవల్ లో రచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు..