ఈ కరోనా టైం లో ఏ హీరో మీద కూడా రానన్ని రూమర్స్ ఒక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మీదే వచ్చాయి. అనేక రూమర్స్… అటు నిర్మాతగా ఇటు హీరోగా తన సినిమాలపై రోజుకో రూమర్ బయట చక్కర్లు కొడుతూనే ఉంది. ముఖ్యంగా హీరోగా ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చేయబోయే సినిమాలు ఏవి కూడా కమిట్ అవ్వని కారణంగా రామ్ చరణ్ పై రూమర్స్ ఎక్కువ అయ్యాయి.
సురేందర్ రెడ్డి, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, వెంకీ కొడుముల, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇలా చెప్పుకుంటూ పొతే చాలా మంది డైరెక్టర్ లు రామ్ చరణ్ కి కథలను అయితే వినిపించినప్పటికీ కూడా రామ్ చరణ్ మాత్రం ఇప్పటి వరకు ఏ సినిమాను కమిట్ అవ్వలేదు.
దాంతో ఈ రూమర్స్ మరింత ఎక్కువ అవ్వగా… ఇప్పుడు లేటెస్ట్ గా వీటికి జవాబుగా మరో రూమర్ చక్కర్లు కొడుతుంది, ఆ న్యూస్ ప్రకారం రామ్ చరణ్ ఇన్ని కథలను వింటున్నా ఏవి కమిట్ అవ్వక పోవడానికి 2 రీజన్స్ ఉన్నాయని అంటున్నారు. ఒకటి నిర్మాతగా చిరు సినిమాలతో బిజీగా ఉండటం…
మరొకటి ఆర్ ఆర్ ఆర్ అయ్యే వరకు కొత్త సినిమాలు కమిట్ అవ్వకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. చిరు అప్ కమింగ్ మూవీస్ కి నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు ఆచార్య లో స్పెషల్ రోల్ కూడా చేయబోతున్నాడు. అంటే ఒక పక్క ఆర్ ఆర్ ఆర్ మరో పక్క ఆచార్య స్పెషల్ రోల్ రెండూ చేయాల్సి ఉంది.
దాంతో వీటితో నే టైం సరిపోతుందని, ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయ్యాకే కొత్త సినిమా మొదలు పెట్టాలని భావిస్తున్నారని అంటున్నారు. అంటే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కి ఆల్ మోస్ట్ మరో ఏడాది పట్టొచ్చు. అప్పటి వరకు రామ్ చరణ్ కొత్త సినిమా కమిట్ అవ్వరని సమాచారం… మళ్ళీ రామ్ చరణ్ బర్త్ డే కే కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఉండొచ్చు అన్న టాక్ ఉంది…