Home న్యూస్ 24 గంటల్లో రామ్ ఫ్యాన్స్ 461.3….విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లెక్క ఏంటంటే??

24 గంటల్లో రామ్ ఫ్యాన్స్ 461.3….విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లెక్క ఏంటంటే??

0

సోషల్ మీడియా లో ఒకపక్క సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డుతో విరుచుకు పడితే మరో పక్క టైర్ 2 హీరోల యానివర్సరీ ట్రెండ్ కూడా రసవత్తరంగా సాగింది. యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లాస్ట్ ఇయర్ మూవీ డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ ని తెచ్చుకుని భారీ నష్టాలను దక్కించుకున్నా కానీ నటుడిగా విజయ్ దేవరకొండ కి మంచి పేరే తెచ్చి పెట్టింది.

కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది పూర్తీ అయిన సందర్భంగా సోషల్ మీడియా లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అలాగే కొందరు మహేష్ ఫ్యాన్స్ కలిసి డియర్ కామ్రేడ్ 1 ఇయర్ ట్రెండ్ ని జరపగా 24 గంటల్లో ఈ ట్రెండ్ పాత రికార్డులను బ్రేక్ చేసింది.

రీసెంట్ గా ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయ్యి 1 ఇయర్ పూర్తీ అయిన సందర్భంగా సోషల్ మీడియా లో భారీ ట్రెండ్ చేసిన రామ్ ఫ్యాన్స్ 24 గంటల్లో పాత రికార్డ్ అయిన 9 ఇయర్స్ 100% లవ్ ట్రెండ్ రికార్డ్ ను బ్రేక్ చేసి 4 లక్షల 61 వేల ట్వీట్ మార్క్ ని క్రాస్ చేశారు.

కాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ 24 గంటలు పూర్తీ అయ్యే సరికి 4 లక్షల 75 వేలకు పైగా ట్వీట్స్ ని పోల్ చేసి పాత రికార్డ్ ను బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ను నమోదు చేశారు. దాంతో ఇప్పుడు టైర్ 2 హీరోల్లో బిగ్గెస్ట్ యానివర్సరీ ట్రెండ్ రికార్డ్ ను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ దక్కించుకోగా రెండో ప్లేస్ లో ఇస్మార్ట్ శంకర్ నిలిచింది.

ఈ ట్రెండ్ లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో పాటు కొందరు మహేష్ ఫ్యాన్స్ కూడా కలిసి ఆల్ మోస్ట్ 1లక్ష రేంజ్ లో ట్వీట్స్ వేయడం విశేషం…సోషల్ మీడియా లో ఈ ట్రెండ్స్ హడావుడి ఈ మధ్య మరీ పీక్స్ కి వెళుతుంది అని చెప్పాలి, ప్రతీ కొత్త ట్రెండ్ లో పాత రికార్డులను బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులను నమోదు చేస్తున్నారు. మరి రానున్న టైం లో ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసే ట్రెండ్ ఏది అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here