Home న్యూస్ పవన్ ఫ్యాన్స్ 10.9 వేస్తె…మహేష్ ఫ్యాన్స్ లెక్క తెలిస్తే మైండ్ బ్లాంక్!!

పవన్ ఫ్యాన్స్ 10.9 వేస్తె…మహేష్ ఫ్యాన్స్ లెక్క తెలిస్తే మైండ్ బ్లాంక్!!

0

సోషల్ మీడియా లో ఈ లాక్ డౌన్ టైం నుండి అందరు హీరోల ఫ్యాన్స్ మరో లెవల్ అనే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ పాత ట్విట్టర్ రికార్డుల బెండు తీస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. కొత్త సినిమా లు ఏవి లేక పోవడం తో టైం పాస్ కోసం ఈ ట్విట్టర్ రికార్డుల మీద పడటం తో ప్రతీ ట్రెండ్ లో కూడా పాత రికార్డులు బ్రేక్ అవుతూ కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి.

లేటెస్ట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా లో బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డు తో ఊచకోత కోశారు. ఏకంగా ఇండియన్ రికార్డులు బ్రేక్ చేస్తూ 24 గంటల్లో ఏకంగా 31.1 మిలియన్ ట్వీట్స్ ని పోల్ చేసి దుమ్ము దుమారం చేసే రికార్డులు సొంతం చేసుకున్నారు.

ఈ క్రమం లో టాలీవుడ్ లో టైటిల్ ట్రెండ్స్ విషయం లో కూడా కొత్త రికార్డులు నమోదు అయ్యాయి. ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్ మెంట్ సమయంలో చేసే ట్రెండ్ లా కాకుండా ఇతర ట్రెండ్స్ లో కూడా టైటిల్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ ఈ ట్రెండ్స్ చేస్తున్నారు ఈ మధ్య.

అందులో భాగంగా ఇది వరకు రెండు సార్లు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పై రికార్డ్ లెవల్ ట్వీట్స్ పడగా రీసెంట్ రికార్డ్ ట్రెండ్ లో 10.9 మిలియన్ ట్వీట్స్ వకీల్ సాబ్ పై 24 గంటల్లో పడి కొత్త రికార్డులు నమోదు అయ్యేలా చేసింది. కాగా ఇప్పుడు ఆ రికార్డును డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేశారు మహేష్ ఫ్యాన్స్….

ఎవ్వరూ ఊహించని రేంజ్ లో 24 గంటల్లో ఒక్క సర్కారు వారి పాట హాష్ టాగ్ పైనే ఏకంగా 21.7 మిలియన్ ట్వీట్స్ పోల్ అయ్యి ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. దాంతో టైటిల్ ట్రెండ్స్ ఓవరాల్ గా బిగ్గెస్ట్ టార్గెట్ ని అప్ కమింగ్ ట్రెండ్స్ కి సెట్ చేసింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here